రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..! ఎన్నికల జిమ్మిక్కా..!
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుదక్కింది. రజనీకాంత్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల ఫ్యాన్స్, తమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజనీకి అవార్డు దక్కడం పట్ల అప్పుడే విమర్శలు కూడా ఊపందుకున్నాయి. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. కేంద్రం రజనీకి అవార్డు ఇచ్చింది కాబట్టి ఆయన ఫ్యాన్స్ అంతా బీజేపీకి దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఓట్లు […]
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుదక్కింది. రజనీకాంత్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల ఫ్యాన్స్, తమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజనీకి అవార్డు దక్కడం పట్ల అప్పుడే విమర్శలు కూడా ఊపందుకున్నాయి. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది.
కేంద్రం రజనీకి అవార్డు ఇచ్చింది కాబట్టి ఆయన ఫ్యాన్స్ అంతా బీజేపీకి దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఓట్లు వేస్తారని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారట. తమిళ ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి.. ఒకవేళ బీజేపీ మీద ఏదైనా కోపం ఉన్నా ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ ఎత్తు వేసిందని సమాచారం.
భారతీయ నటుల్లో గొప్పనటుడైన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అవార్డు ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఆయనలో ఒక్క నటుడు మాత్రమే కాక.. నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా ఆయన సత్తా చాటారని పేర్కొన్నారు.
ధన్యవాదాలు చెప్పిన మోదీ..!
రజనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన ఎన్నో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారని పేర్కొన్నారు. రజనీ సేవలు మరువలేనివని కొనియాడారు. రజనీకాంత్ ఒక్క తమిళనాడు మాత్రమే కాక .. దేశం మొత్తం గర్వించదగ్గ నటుడు అంటూ కొనియాడారు.
గతంలోనూ ఎన్నో అవార్డులు..!
బస్కండెక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఒక్క తమిళనాడులో కాక.. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో, వైవిధ్యమైన చిత్రాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా రజనీ స్టయిల్, డైలాగ్ డెలివరీ, వాకింగ్ స్టయిల్, డ్యాన్స్ అన్ని భిన్నంగానే ఉంటాయి. అందుకే ఆయనకు తమిళనాడులో అంత క్రేజ్ ఉంది.
ఎన్నో అవార్డులు..
రజనీకి గతంలో పద్మవిభూషణ్ సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. గతంలో శివాజీ గణేషన్(తమిళం), రాజ్‌కుమార్(కన్నడ), బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి (తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు), గోపాలకృష్ణన్ (మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్ (తెలుగు, తమిళం), కె విశ్వనాథ్(తెలుగు) ఈ అవార్డులు అందుకున్నారు.
రాజకీయం కోసమేనా?
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రజనీకి అవార్డు వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతుండగా.. ప్రత్యర్థులు, కొందరు విమర్శకులు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ అర్హుడే కానీ.. ఈ ఎన్నికల టైంలో అవార్డు ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నదని కొందరు విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా దక్షిణాదికి చెందిన రజనీకి అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయం.