కొత్త సినిమాను పక్కనపెట్టిన నాగార్జున
రేపు థియేటర్లలోకి రాబోతోంది వైల్డ్ డాగ్ మూవీ. ఈ సినిమా కోసం ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాను సైతం పక్కనపెట్టాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న మూవీని తాత్కాలికంగా ఆపేశాడు. ఇలా వైల్డ్ డాగ్ ప్రమోషన్ కోసం భారీగా టైమ్ కేటాయించడానికి రీజన్స్ కూడా చెబుతున్నాడు నాగ్. “వైల్డ్ డాగ్ అనేది ఓ ప్రయోగాత్మక కమర్షియల్ సినిమా. ఇందులో పాత్రలకు తగ్గట్టే నటీనటుల్ని ఎంపిక చేశాం. నేను తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ముఖాల్లేవ్. కాబట్టి ఇలాంటి […]
రేపు థియేటర్లలోకి రాబోతోంది వైల్డ్ డాగ్ మూవీ. ఈ సినిమా కోసం ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాను సైతం
పక్కనపెట్టాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న మూవీని తాత్కాలికంగా ఆపేశాడు. ఇలా
వైల్డ్ డాగ్ ప్రమోషన్ కోసం భారీగా టైమ్ కేటాయించడానికి రీజన్స్ కూడా చెబుతున్నాడు నాగ్.
“వైల్డ్ డాగ్ అనేది ఓ ప్రయోగాత్మక కమర్షియల్ సినిమా. ఇందులో పాత్రలకు తగ్గట్టే నటీనటుల్ని ఎంపిక
చేశాం. నేను తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ముఖాల్లేవ్. కాబట్టి ఇలాంటి సినిమాను ప్రేక్షకులముందుకు
తీసుకెళ్లాలంటే భారీ ప్రమోషన్ తప్పనిసరి. అందుకే ప్రవీణ్ సత్తారు సినిమాను పక్కనపెట్టి మరీ వైల్డ్ డాగ్
ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.”
ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కింది వైల్డ్ డాగ్ సినిమా. ఇది కేవలం 2 గంటల నిడివి మాత్రమే ఉంది.
ఇందులో ఎలాంటి సాంగ్స్ ఉండవు. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందంటున్నాడు నాగార్జున.