Telugu Global
Cinema & Entertainment

సుల్తాన్ టైటిల్ వెనక సీక్రెట్ ఇదే

మరికొన్ని గంటల్లో సుల్తాన్ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు కార్తి. ఇదొక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అంటున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు ఈ మూవీకి సుల్తాన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని బయటపెట్టాడు కార్తి. “ఈ సినిమాలో మలయాళం యాక్ట‌ర్ లాల్ గారు నా గాడ్ ఫాద‌ర్ లాంటి క్యారెక్ట‌ర్ చేశారు. వాళ్లు ఈ సినిమాలో ముస్లీమ్స్‌. చిన్న‌ప్ప‌టినుండి వాళ్లే పెంచుతారు. అత‌ను న‌న్నుముద్దుగా సుల్తాన్ అని పిలుస్తాడు. అందుకే […]

సుల్తాన్ టైటిల్ వెనక సీక్రెట్ ఇదే
X

మరికొన్ని గంటల్లో సుల్తాన్ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు కార్తి. ఇదొక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్
కాన్సెప్ట్ మూవీ అంటున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు ఈ మూవీకి సుల్తాన్ అనే టైటిల్ ఎందుకు
పెట్టారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని బయటపెట్టాడు కార్తి.

“ఈ సినిమాలో మలయాళం యాక్ట‌ర్ లాల్ గారు నా గాడ్ ఫాద‌ర్ లాంటి క్యారెక్ట‌ర్ చేశారు. వాళ్లు ఈ
సినిమాలో ముస్లీమ్స్‌. చిన్న‌ప్ప‌టినుండి వాళ్లే పెంచుతారు. అత‌ను న‌న్నుముద్దుగా సుల్తాన్ అని
పిలుస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది.”

ఈ సినిమాతోనే కోలీవుడ్ కు పరిచయమౌతోంది రష్మిక. తొలిసారి రష్మికతో కలిసి వర్క్ చేయడం
బాగుందని.. సుల్తాన్ లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని అంటున్నాడు కార్తి.

“త‌ను ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తుంది. త‌ను ఇంత‌కు ముందు అలాంటి పాత్ర‌లు
చేసింది అనుకున్నాను. కాని త‌న‌కి ఇది ఫ‌స్ట్ టైమ్‌. ప‌ల్లెటూరు అంటే ఏం తెలీదు. ఈ సినిమాలో ట్రాక్ట‌ర్
న‌డ‌ప‌డం, పాలు పిత‌క‌డం వంటి ప‌నుల‌న్ని చేసింది. స‌గం మూవీ పూర్త‌య్యాక విలేజ్ లైఫ్ ఇంత ట‌ఫ్‌గా
ఉంటుందా? అని అడిగేది.”

నాగ్ నటించిన వైల్డ్ డాగ్ కు పోటీగా వస్తోంది సుల్తాన్. నాగ్ సినిమా చూసిన తర్వాత తన సినిమా
చూడాలని ప్రేక్షకుల్ని కోరుతున్నాడు కార్తి.

First Published:  1 April 2021 1:41 AM IST
Next Story