Telugu Global
National

నందిగ్రామ్​లో '144'

నందిగ్రామ్.. ఈ ప్రాంతం బెంగాల్​ రాజకీయాలనే మార్చేసింది. దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఉపయోగపడింది. అందుకే ‘నందిగ్రామ్’ లో అప్పట్లో జరిపిన కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక్కడ రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలు సైతం వాళ్లకు మద్దతు ఇచ్చారు. నందిగ్రామ్​ ఉద్యమం మమతా బెనర్జీని అధికారం పీఠం ఎక్కించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందిగ్రామ్​ నియోజకవర్గంపై మరోసారి చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ […]

నందిగ్రామ్​లో 144
X

నందిగ్రామ్.. ఈ ప్రాంతం బెంగాల్​ రాజకీయాలనే మార్చేసింది. దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఉపయోగపడింది. అందుకే ‘నందిగ్రామ్’ లో అప్పట్లో జరిపిన కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక్కడ రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలు సైతం వాళ్లకు మద్దతు ఇచ్చారు. నందిగ్రామ్​ ఉద్యమం మమతా బెనర్జీని అధికారం పీఠం ఎక్కించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నందిగ్రామ్​ నియోజకవర్గంపై మరోసారి చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్నారు. అదికూడా గతంలో తృణమూల్​ కాంగ్రెస్​లో ఉండి.. ప్రస్తుతం బీజేపీలో చేరిన సువేందు అధికారి మీద. దీంతో ఈ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సువేందు అధికారి గతంలో నందిగ్రామ్​ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ ఉద్యమానికి దీదీ మద్దతు ఇచ్చారు. ఇద్దరూ నందిగ్రామ్​ ప్రజలకు కావాల్సిన వాళ్లే.. అయితే ఇక్కడ ఎవరు? గెలుస్తారన్న విషయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మమతా బెనర్జీ నందిగ్రామ్​లో ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంపై టీఎంసీ, బీజేపీ గట్టిగా దృష్టి సారించాయి. ఎలాగైనా గెలవాలని ఇరుపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో టీఎంసీ, బీజేపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ విధిస్తున్నట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రకటించింది.

పశ్చిమబెంగాల్​లో మొత్తం.. 8 విడతల్లో పోలింగ్‌ జరుగనుంది. ఇదిలా ఉంటే నందిగ్రామ్​లో రెండో విడత పోలింగ్ ఇవాళ జరుగబోతున్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి హోరాహోరీ తలపడుతున్నారు.

రేపటి వరకూ ఈ ప్రాంతంలో ఆంక్షలు అమల్లో ఉన్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. హింస, శాంతి భద్రతల విఘాతం, అనుచిత ఘటనలకు అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చినట్టు హల్దియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అవ్నీత్ పునియా తెలిపారు. పోలింగ్ ప్రాంతానికి 200 మీటర్ల దూరం వరకూ ఐదు లేదా ఆరుగురు వ్యక్తులు గుమిగూడరాదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇక్కడ బీజేపీ నేతలు అరాచకాలు సృష్టించాలని భావిస్తున్నారని.. అందుకే కేంద్ర బలగాలను దించి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని మమత మండిపడ్డారు.

First Published:  31 March 2021 5:34 PM IST
Next Story