జానారెడ్డి గెలిస్తే.. పీసీసీ ఇచ్చేస్తారా? అధిష్ఠానం మదిలో ఏముంది?
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? చాలా కాలంగా ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో ఉత్తమ్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ, జానారెడ్డి […]
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? చాలా కాలంగా ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో ఉత్తమ్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నది.
ఇదిలా ఉంటే ఇప్పటికే రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ, జానారెడ్డి సూచనతో పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం పెండింగ్‌లో పడిపోయింది. తాజాగా జానారెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ సాగర్‌లో జానారెడ్డి గెలుపొందితే .. ఆయనకు పీసీసీ పీఠం కన్ఫార్మ్ అనే చర్చ నడుస్తోంది. జానారెడ్డి మాత్రం ప్రస్తుతం ‘సాగర్ బై ఎలక్షన్’ పైనే ఫోకస్ పెట్టారు. అక్కడ ఎలాగైనా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ జానారెడ్డి కి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలోని వారంతా సైలెంట్‌గా ఉండిపోయే అవకాశం ఉందని అధిష్ఠానం యోచిస్తుందట.
ఇప్పటికే చాలా సార్లు రేవంత్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ, కొందరు సీనియర్ నేతలు మాత్రం.. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. తాము పార్టీని వీడతామంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది.
కొంతకాలం పాటు జీవన్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఒక వేళ జీవన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే వర్గపోరు తగ్గిపోవచ్చని ఆ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా జానారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గతంలో ఆయన హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగానూ వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. కీలక సమయంలో ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి జానారెడ్డే అనే ప్రచారం కూడా సాగింది. జానారెడ్డి తొలుత టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి కీలకనేతగా ఎదిగారు. ఒకవేళ ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే.. కాంగ్రెస్‌లో అసంతృప్తులు చల్లారవచ్చని ఆ పార్టీ భావిస్తున్నదట. సాగర్‌లో గనక జానారెడ్డి గెలిస్తే ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.