Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కు విలన్ గా కమెడియన్?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ఇప్పుడిప్పుడే పనులన్నీ ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తుది దశకు చేరడంతో.. జూన్ నుంచి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పడం, కాల్షీట్లు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ రీసెంట్ గా ప్రకటించారు కూడా. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఆర్టిస్టుల వేట మొదలైంది. ఇందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో విలన్ పాత్ర కోసం […]

ఎన్టీఆర్ కు విలన్ గా కమెడియన్?
X

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ఇప్పుడిప్పుడే పనులన్నీ ఓ కొలిక్కి వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ తుది దశకు చేరడంతో.. జూన్ నుంచి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తానని ఎన్టీఆర్
చెప్పడం, కాల్షీట్లు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ రీసెంట్ గా
ప్రకటించారు కూడా.

దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఆర్టిస్టుల వేట మొదలైంది. ఇందులో
భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సునీల్
ను తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.

సునీల్ కు విలన్ పాత్రలు కొత్తకాదు. కలర్ ఫొటో అనే సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు. ఇక
రవితేజ నటించిన డిస్కో రాజా అనే సినిమాలో కూడా విలన్ గా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా సునీల్ ను తేనె పూసిన కత్తి టైపు విలన్ పాత్రలో చూపించడానికి రెడీ అవుతున్నాడట త్రివిక్రమ్.

First Published:  30 March 2021 9:01 AM IST
Next Story