చంద్రుడి సాయంతోనే నౌక కదిలిందా..?
ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన సూయజ్ కెనాల్ నౌక ఎట్టకేలకు కదిలింది. అయితే దీన్ని కదిలించగలగడానికి పున్నమి చంద్రుడు కూడా ఓ కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలాగంటే.. ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకొని ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ సోమవారం ఇరుక్కున్న ప్రదేశం నుంచి కదిలింది. దీనికోసం ఏడు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే పున్నమిరోజున చంద్రుడి కారణంగా […]
ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన సూయజ్ కెనాల్ నౌక ఎట్టకేలకు కదిలింది. అయితే దీన్ని కదిలించగలగడానికి పున్నమి చంద్రుడు కూడా ఓ కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలాగంటే..
ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకొని ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ సోమవారం ఇరుక్కున్న ప్రదేశం నుంచి కదిలింది. దీనికోసం ఏడు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే పున్నమిరోజున చంద్రుడి కారణంగా ఈ ప్రయత్నాలు ఆదివారం ఫలించాయని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
కాలువ ఒడ్డున ‘ఎవర్ గివెన్’ నౌక ముందుభాగం కూరుకుపోయి ఉన్న ప్రాంతంలోని ఇసుక, బంకమట్టిని ముందుగా డ్రెడ్జర్లతో తవ్వారు. దీంతో ఆ ప్రాంతం లోతుగా మారింది. దాంట్లో నీటిని పంప్ చేయగా, నౌక కొద్దిగా ఆ నీటిలో తేలియాడింది. ఇదేసమయంలో బలమైన గాలులు వీయడంతో అలలు ఎగసిపడి కాలువ మధ్యలోకి నౌక క్రమంగా చేరగలిగింది.
1300 ఫీట్ల వెడల్పు ఉన్న ఆ నౌక కెనాల్ కు అడ్డంగా చిక్కుకోవడంతో.. నౌక ను కదిలించేందుకు .. మహా యంత్రాంగమే రంగంలోకి దిగింది. థగ్ బోట్ల సాయంతో ఆ సరుకు నౌకను కదలించే ప్రయత్నం చేశారు. అయితే ఇంజనీర్ల కృషితో పాటు ప్రకృతి కూడా సహకరించడం వల్లే ఈ పని సులువైందట. పున్నమి రోజున సముద్రంలో ఉండే ఆటుపోట్లు దీనికి సహకరించాయట. ఆదివారం పున్నమి(సూపర్‌మూన్) కావడంతో.. సముద్రంలో అలాగే కెనాల్స్ లో భారీ అలలు వచ్చాయి. డ్రెడ్జింగ్‌కు అలలు తోడు కావడంతో.. ఎవర్ గివెన్ నౌక సముద్ర నీటిలో ఈజీగా తేలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలా మొత్తంగా మానవ కృషి, ప్రకృతి సాయంతో స్తంభించిపోయిన వేల కోట్ల వ్యాపారాన్ని తిరిగి గట్టెక్కించగలిగారు.
సూయజ్’లో నౌక నిలిచిన సమయం-సుమారు ఏడు రోజులు, నిలిచిపోయిన నౌకలు-కనీసం 367, దీనివల్ల జరిగిన నష్టం-రూ.4.86 లక్షల కోట్లు.