Telugu Global
Cinema & Entertainment

మాస్ట్రోగా మారిన నితిన్

హిందీలో సూపర్ హిట్టయిన అంథాధూన్ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీకి మాస్ట్రో అనే టైటిల్ పెట్టారు. మూవీలో నితిన్, కీబోర్డ్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. అందుకే ఇలా మాస్ట్రో అనే టైటిల్ పెట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలకమైన లేడీ విలన్ పాత్రలో తమన్న […]

మాస్ట్రోగా మారిన నితిన్
X

హిందీలో సూపర్ హిట్టయిన అంథాధూన్ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీకి మాస్ట్రో అనే టైటిల్
పెట్టారు. మూవీలో నితిన్, కీబోర్డ్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. అందుకే ఇలా మాస్ట్రో అనే టైటిల్
పెట్టారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా
నటిస్తోంది. కీలకమైన లేడీ విలన్ పాత్రలో తమన్న కనిపించబోతోంది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ తమన్న
చేస్తున్న నెగెటివ్ రోల్ ఇది. హిందీలో ఈ పాత్రను టబు పోషించింది.

తన సొంత బ్యానర్ పై నితిన్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేసిన నితిన్, మాస్ట్రోను
కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. జూన్ 11న రిలీజ్ అవుతుంది మాస్ట్రో.

First Published:  30 March 2021 9:03 AM IST
Next Story