Telugu Global
National

కంబాళవీరుడి కొత్త రికార్డు.. చూస్తే కళ్లు తిరిగిపోతాయి..

కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తన రికార్డును తానే తిరగరాసుకొని.. తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసగౌడకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. గత ఏడాది ఆయన కంబాళ దున్నలతో పాటు 42.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో (100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి) పూర్తిచేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. తాజాగా 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి […]

కంబాళవీరుడి కొత్త రికార్డు.. చూస్తే కళ్లు తిరిగిపోతాయి..
X

కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తన రికార్డును తానే తిరగరాసుకొని.. తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసగౌడకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. గత ఏడాది ఆయన కంబాళ దున్నలతో పాటు 42.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో (100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి) పూర్తిచేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.

తాజాగా 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. గతేడాది అతడు 100 మీటర్ల ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) బ్రేక్​ చేసినప్పుడే అంతా ఆశ్యర్యపోయారు. తాజాగా ఎవ్వరూ ఊహించని రీతిలో రెచ్చిపోయాడు. అతి తక్కువ టైంలో 100 మీటర్ల పరుగును సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. శ్రీనివాసగౌడను ఒలింపిక్స్‌కు సిద్దం చేయాలని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అతడికి ఆహ్వానం పంపింది. అయితే అతడు మాత్రం వాళ్ల ఆహ్వానాన్ని తిరస్కరించాడు.

ఇంతకీ పోటీలు ఎక్కడ జరిగాయంటే..
కర్ణాటకలోని బంత్వాల్‌లో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. 125 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతడు లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు లెక్కగట్టారు.

గతవారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబాళ పోటీల్లో శ్రీనివాస గౌడ 100 మీటర్ల లక్ష్యాన్ని 8.96 సెకన్లలోనే చేరుకుని రికార్డు సృష్టించాడు. కాగా వారం వ్యవధిలోనే అతడు రికార్డు తిరగరాయడం గమనార్హం.

ఏమిటీ కంబాళ క్రీడ..
‘కంబాళ’ కర్ణాటకలో బాగా ప్రసిద్ధి చెందిన క్రీడ. ఈ ఆటను ఎక్కువగా దక్షిణ కర్ణాటక, ఉడిపి, తుళునాడు ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. అక్కడ సంప్రదాయబద్దంగా ఈ ఆటను కొనసాగిస్తారు. కంబాళ ఆట ఎంతో విచిత్రంగా సాగుతుంది. క్రీడాకారుడు ఎద్దులను ఉసిగొల్పుతూ బురదనీటిలో వేగంగా పరుగెత్తాలి. అది కూడా నిర్ణీత సమయంలోనే. ఎవరైతే తక్కువ టైంలో లక్ష్యాన్ని చేరుకుంటారో.. వారే విజేత. కంబాళ క్రీడను కన్నడ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. శ్రీనివాసగౌడకు కన్నడ నాట మంచి క్రేజ్​ తెచ్చి పెట్టింది ఈ ఆట.

First Published:  30 March 2021 12:39 PM IST
Next Story