Telugu Global
National

శానిటైజరా..? గంగాజలమా..? ఏది బెస్ట్..

కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ, మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్.. వీటిపై ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ పోలీసులు మాత్రం శానిటైజర్ బదులు గంగాజలం వాడండి అంటూ స్టేషన్ కు వచ్చినవారికి ఉచిత సలహా ఇస్తున్నారు. అంతేకాదు, ఉచితంగా గంగాజలం బాటిల్ కూడా ఇచ్చేస్తున్నారు. అది హోలీ కానుక అని చెబుతున్నారు. హోలీ పండగ సందర్భంగా మద్యం బహుమతిగా ఇచ్చి సందడి చేసే బదులు, గంగా […]

శానిటైజరా..? గంగాజలమా..? ఏది బెస్ట్..
X

కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ, మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్.. వీటిపై ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ పోలీసులు మాత్రం శానిటైజర్ బదులు గంగాజలం వాడండి అంటూ స్టేషన్ కు వచ్చినవారికి ఉచిత సలహా ఇస్తున్నారు. అంతేకాదు, ఉచితంగా గంగాజలం బాటిల్ కూడా ఇచ్చేస్తున్నారు. అది హోలీ కానుక అని చెబుతున్నారు. హోలీ పండగ సందర్భంగా మద్యం బహుమతిగా ఇచ్చి సందడి చేసే బదులు, గంగా జలం బాటిల్స్ ని ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చుకోండి అంటూ సలహా ఇస్తున్నారు.

గంగాజలం పవిత్రమే కానీ, శానిటైజర్ కి ప్రత్యామ్నాయమా..?
గంగాజలం పవిత్రమే కానీ శానిటైజర్ కి అది ప్రత్యామ్నాయం అవుతుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. శానిజైటర్ బదులు గంగాజలాన్ని చల్లుకోండి, చేతులు శుభ్రం చేసుకోండి అంటూ సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే చెప్పడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజల్లోని వైజ్ఞానిక దృక్పథాన్ని ఇలా నాశనం చేయడం సరికాదని అంటున్నారు విపక్ష నేతలు. అధికారుల అత్యుత్సాహమా? లేక సీఎం యోగి ఆదేశ‌మా? అని ప్రశ్నిస్తున్నారు. గంగాజలాన్ని పవిత్రంగా చూడండి కానీ, శానిటైజర్ బదులు దాన్ని ఉపయోగించండి అనే తప్పుడు సలహా ఇవ్వొద్దని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని అంటున్నారు. గతంలో బీజేపీ నేతలు కొంతమంది ఫలానా ఆకులు తింటే కరోనా రాదు, ఫలానా బ్రాండ్ అప్పడం తింటే అసలు వైరస్ దరిచేరదు అని చెప్పి విమర్శలపాలయ్యారు. ఆ తర్వాత వారు కూడా కరోనాతో ఇబ్బందిపడ్డారనుకోండి. సహజంగా ఇలాంటి ప్రచారాలన్నీ బీజేపీని ఇరుకున పెడుతుంటాయి, కొంతవరకు హిందూ సమాజంలో వారి మైలేజీ పెంచుతుంటాయి. అయితే ఈసారి పోలీసులు ఇలా గంగాజలం పేరుతో అడ్డంగా బుక్కయ్యారు.

మొత్తమ్మీద మీరట్ పోలీసుల ప్రయత్నం ఇలా రివర్స్ కావడంతో వారు తలలు పట్టుకున్నారు. హోలీ వేళ, రంగులు చల్లుకోవద్దు, గంగా జలాన్ని చల్లుకోండి అని మాత్రమే తాము చెప్పామని వివరణ ఇస్తున్నారు. శానిటైజర్ కంటే గంగాజలం పవిత్రం అని చెప్పడమే తమ ఉద్దేశమని అంటున్నారు. ప్రజలంతా మాస్క్ లు ధరించాలని, అదే సమయంలో శానిటైజర్ కూడా వాడాలని అంటున్నారు. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు.

First Published:  28 March 2021 9:36 PM GMT
Next Story