37 ఏళ్ల కత్రినాకైఫ్ గ్లామర్ సీక్రెట్
కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ ఆ ఛాయలు మాత్రం శరీరంపై కనిపించవు. బాలీవుడ్ క్వీన్ కత్రినాకైఫ్ ఈ కేటగిరికీ చెందిన హీరోయిన్. ఆమె వయసు 37 ఏళ్లు అనే సంగతి ప్రత్యేకంగా చెబితే తప్ప గుర్తుపట్టలేం. మరి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఇంత ఫిట్ గా, గ్లామరస్ గా ఉండడానికి కత్రినా పాటిస్తున్న చిట్కాలేంటి? అంతా అనుకుంటున్నట్టు తను ప్రత్యేకంగా ఎలాంటి చిట్కాలు పాటించనని చెబుతోంది కత్రినాకైఫ్. తినడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం. ఈ 3 అంశాల్ని క్రమం […]
కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ ఆ ఛాయలు మాత్రం శరీరంపై కనిపించవు. బాలీవుడ్ క్వీన్
కత్రినాకైఫ్ ఈ కేటగిరికీ చెందిన హీరోయిన్. ఆమె వయసు 37 ఏళ్లు అనే సంగతి ప్రత్యేకంగా చెబితే తప్ప
గుర్తుపట్టలేం. మరి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఇంత ఫిట్ గా, గ్లామరస్ గా ఉండడానికి కత్రినా పాటిస్తున్న
చిట్కాలేంటి?
అంతా అనుకుంటున్నట్టు తను ప్రత్యేకంగా ఎలాంటి చిట్కాలు పాటించనని చెబుతోంది కత్రినాకైఫ్. తినడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం. ఈ 3 అంశాల్ని క్రమం తప్పకుండా పాటిస్తానని, అదే తన గ్లామర్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్ అని చెబుతోంది. ఈ మూడింటిలో ఏది బ్యాలెన్స్ తగ్గినా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ తగ్గుతుందని చెబుతోంది.
దాదాపు 15 ఏళ్లుగా కత్రినాకైఫ్ ఒకే రకమైన ఆహారాన్ని తింటోందట. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పటికీ.. తన శరీరానికి ఆ ఆహారం మాత్రమే సూట్ అవుతుందని, అది తింటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తానని, టైమ్ కు పడుకుంటానని చెబుతోంది ఈ చిన్నది.