Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేయను

ఫ్యాన్స్ కోసం హీరోలు ఎన్నో చేస్తుంటారు. తెరవెనక వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఇక ఫంక్షన్లకు వచ్చే ఫ్యాన్స్ కు సెపరేట్ గా పేమెంట్స్ కూడా ఇస్తుంటారు. కానీ నాని మాత్రం ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేయనంటున్నాడు. తన కోసం ఆఫీసులకు రావొద్దని ఓపెన్ గా చెబుతున్నాడు. “ఫ్యాన్స్ ను పట్టించుకోవడం లేదంటూ నాపై సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పడుతుంటాయి. నిజమే నేను ఎంకరేజ్ చేయను. నా కోసం మీరు కటౌట్లు కట్టక్కర్లేదు, పాలాభిషేకాలు చేయనక్కర్లేదు. […]

ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేయను
X

ఫ్యాన్స్ కోసం హీరోలు ఎన్నో చేస్తుంటారు. తెరవెనక వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఇక ఫంక్షన్లకు వచ్చే ఫ్యాన్స్ కు సెపరేట్ గా పేమెంట్స్ కూడా ఇస్తుంటారు. కానీ నాని మాత్రం ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేయనంటున్నాడు. తన కోసం ఆఫీసులకు రావొద్దని ఓపెన్ గా చెబుతున్నాడు.

“ఫ్యాన్స్ ను పట్టించుకోవడం లేదంటూ నాపై సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పడుతుంటాయి. నిజమే నేను ఎంకరేజ్ చేయను. నా కోసం మీరు కటౌట్లు కట్టక్కర్లేదు, పాలాభిషేకాలు చేయనక్కర్లేదు. మా అమ్మానాన్నలు నన్ను చూసి గర్వపడుతుంటారు.. అలా నన్ను చూసి అభిమానులు గర్వపడేలా చేస్తాను. మీ మనసుల్లో నన్ను ఉంచుకోండి చాలు.”

టక్ జగదీశ్ పరిచయ వేదిక అంటూ రాజమండ్రిలో పబ్లిక్ ఫంక్షన్ పెట్టింది యూనిట్. అలా టక్ జగదీష్ ప్రమోషన్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేదికపై మాట్లాడిన నాని, అభిమానులపై తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టాడు.

First Published:  28 March 2021 8:43 AM IST
Next Story