Telugu Global
National

కేసులు పెరుగుతున్నా.. లాక్ డౌన్ లేనట్టే..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్.. ప్రజల్ని, ప్రభుత్వాల్ని భయపెడుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మహారాష్ట్రలో ఆల్రడీ పాత రికార్డులు బద్దలయ్యాయి, తెలుగు రాష్ట్రాలు నాలుగు నెలల వెనక్కు వెళ్లిపోయాయి. గతంలో ఇంతకంటే తక్కువ కేసులు ఉన్న సమయంలోనే లాక్ డౌన్ అమలులో ఉంది. కానీ ఇప్పుడు జనసంచారంపై, రవాణాపై, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు మాత్రం లేవు. తెలంగాణ జస్ట్ స్కూళ్లు మూసేసింది, మిగతా కార్యకలాపాలు ఆపే ప్రసక్తే లేదని అసెంబ్లీలోనే తేల్చి […]

కేసులు పెరుగుతున్నా.. లాక్ డౌన్ లేనట్టే..
X

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్.. ప్రజల్ని, ప్రభుత్వాల్ని భయపెడుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మహారాష్ట్రలో ఆల్రడీ పాత రికార్డులు బద్దలయ్యాయి, తెలుగు రాష్ట్రాలు నాలుగు నెలల వెనక్కు వెళ్లిపోయాయి. గతంలో ఇంతకంటే తక్కువ కేసులు ఉన్న సమయంలోనే లాక్ డౌన్ అమలులో ఉంది. కానీ ఇప్పుడు జనసంచారంపై, రవాణాపై, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు మాత్రం లేవు. తెలంగాణ జస్ట్ స్కూళ్లు మూసేసింది, మిగతా కార్యకలాపాలు ఆపే ప్రసక్తే లేదని అసెంబ్లీలోనే తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ అనే మాటే లేదని అన్నారు.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే మాటని అధికారికంగా ప్రకటించింది. కేసులు పెరుగుతున్నా లాక్ డౌన్ విధించబోమని, మాస్క్ ల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటు ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అనే పేరు లేకుండానే ఆంక్షలు కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటికొస్తే జరిమానా, గుంపులు గుంపులుగా కనిపిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. కేసులు భారీగా ఉన్న మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ తప్ప అన్నీ చేస్తాం అన్నట్టుగా ఉంది. ఒకరకంగా లాక్ డౌన్ అంటేనే అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు రెండూ భయపడుతున్నాయి. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈ దఫా, అది మినహా అన్నీ చేస్తామంటున్నారు ప్రభుత్వాధినేతలు.

ప్రధానిసైతం వెనకడుగు..
సెకండ్ వేవ్ ప్రభావం మొదలైన తర్వాత, ఇటీవల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేస్తారేమోనని అందరూ ఆశించారు. కానీ ఆయన వ్యాక్సినేషన్ పై సందేశమిచ్చి సైలెంట్ అయ్యారు. గతంలో సడన్ గా లాక్ డౌన్ అని ప్రకటించి విమర్శలపాలయ్యారు మోదీ. కరోనా మరణాలతోపాటు, దేశంలో ఆకలి చావులు, ప్రయాణంలో చావులు ఎక్కువయ్యాయి. ఆర్థికంగా దేశం పదేళ్ల వెనక్కు వెళ్లిపోయింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు కుదురుకోలేకపోతున్నాయి. కేంద్రం ప్రకటించిన 2లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎటు పోయిందో తెలియదు. పన్నుల భారం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో రెండోదశ లాక్ డౌన్ అన్నారంటే మాత్రం ముందు అడ్డంగా బుక్కయ్యేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికల వేళ అలాంటి సాహసం చేస్తే, ఎవరికి లాభమో బీజేపీకి బాగా తెలుసు. పైగా లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గింది అనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. అందుకే సెకండ్ వేవ్ కి విరుగుడు లాక్ డౌన్ కాదని ప్రాథమికంగా తేల్చేశాయి ప్రభుత్వాలు. జనజీవనం స్తంభించే పనులు చేయబోమని.. పరోక్ష సంకేతాలిచ్చేశాయి. ఇక ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే.. ప్రజల ముందున్న ఏకైక మార్గం.

First Published:  27 March 2021 8:43 PM GMT
Next Story