రంగ్ దే మొదటి రోజు వసూళ్లు
చెక్ సినిమా ఫ్లాప్ తో డీలాపడిన నితిన్, రంగ్ దేతో ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు. కామెడీ పండడంతో ఈ సినిమా చాలామందికి నచ్చింది. అలా ఈ ఏడాది తన ఖాతాలో మరో విజయాన్ని నమోదుచేసుకున్నాడు నితిన్. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రంగ్ దే సినిమాకు ఏపీ, నైజాంలో కలుపుకొని 4 కోట్ల 65 లక్షల వసూళ్లు వచ్చాయి. సినిమాకు భారీగా ప్రమోషన్ కల్పించడం, ట్రయిలర్ హిట్టవ్వడంతో ఈ వసూళ్లు […]

చెక్ సినిమా ఫ్లాప్ తో డీలాపడిన నితిన్, రంగ్ దేతో ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు. కామెడీ పండడంతో ఈ సినిమా చాలామందికి నచ్చింది. అలా ఈ ఏడాది తన ఖాతాలో మరో విజయాన్ని నమోదుచేసుకున్నాడు నితిన్. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది.
తొలిరోజు రంగ్ దే సినిమాకు ఏపీ, నైజాంలో కలుపుకొని 4 కోట్ల 65 లక్షల వసూళ్లు వచ్చాయి. సినిమాకు భారీగా ప్రమోషన్ కల్పించడం, ట్రయిలర్ హిట్టవ్వడంతో ఈ వసూళ్లు సాధ్యపడ్డాయి. ఏపీలో భారత్ బంద్ ప్రభావం లేకుంటే ఇంకాస్త పెరిగేవి కూడా. సోమవారం కూడా శెలవు కావడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 1.54 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.56 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.31 కోట్లు
గుంటూరు – రూ. 0.67 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.21 కోట్లు