Telugu Global
NEWS

సాగర్​ బరిలో వైసీపీ.. ఇది కేసీఆర్​ స్కెచ్చా?

ప్రస్తుతం తెలంగాణలో సాగర్​ ఉప ఎన్నిక వేడి కొనసాగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించేసింది. ఆయన చాలా రోజుల నుంచి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్​ఎస్, బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం మల్ల గుల్లాలు పడుతున్నాయి. టీఆర్​ఎస్​ అభ్యర్థిని ప్రకటించాక.. ఆ పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసి .. తమ పార్టీ తరపున నిలబెట్టాలన్నది బీజేపీ స్కెచ్​. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేసీఆర్​.. ఉద్దేశ్యపూర్వకంగానే అభ్యర్థి ఎంపికలో జాప్యం […]

సాగర్​ బరిలో వైసీపీ.. ఇది కేసీఆర్​ స్కెచ్చా?
X

ప్రస్తుతం తెలంగాణలో సాగర్​ ఉప ఎన్నిక వేడి కొనసాగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించేసింది. ఆయన చాలా రోజుల నుంచి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్​ఎస్, బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం మల్ల గుల్లాలు పడుతున్నాయి. టీఆర్​ఎస్​ అభ్యర్థిని ప్రకటించాక.. ఆ పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసి .. తమ పార్టీ తరపున నిలబెట్టాలన్నది బీజేపీ స్కెచ్​.

బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేసీఆర్​.. ఉద్దేశ్యపూర్వకంగానే అభ్యర్థి ఎంపికలో జాప్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు వైసీసీ తన అభ్యర్థిని ఇక్కడ రంగంలోకి దించింది. మామూలుగా తెలంగాణలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ యాక్టివిటీస్​ చాలా రోజులుగా తగ్గిపోయాయి. ఆ పార్టీ పరోక్షంగా టీఆర్​ఎస్​కే మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ వైసీసీ పోటీకి పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.

ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు సాగర్‌ ఉప ఎన్నికకు 13 నామినేషన్స్‌ దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌ సింగ్‌ తెలిపారు. అందులో 12 మంది ఇండిపెండెంట్లు కాగా.. మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు. అయితే ఈ సారి ఇక్కడ వైసీసీ అభ్యర్థి పోటీచేయడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కేసీఆర్​ సహకారంతోనే వైసీపీ అభ్యర్థి బరిలో నిలిచారా? అన్న చర్చ జరుగుతున్నది. నిజానికి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంటుంది. అక్కడ రెడ్డి సామాజికవర్గం బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే నిజానికి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇస్తుందనే ప్రచారం ఉంది.

ఇదిలా ఉంటే సాగర్​ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని కేసీఆర్​ యోచిస్తున్నారట. ఈ క్రమంలో కేసీఆర్​ ప్రోద్భలంతోనే వైసీసీ అభ్యర్థిని పెట్టినట్టు సమాచారం. ఒకవేళ వైసీసీ ఇక్కడ అభ్యర్థిని నిలిపితే వైసీసీ అభిమానులు, రెడ్డి కులానికి చెందిన ఓట్లు చీల్చ వచ్చని సీఎం కేసీఆర్​ స్కెచ్​ వేసినట్టు సమాచారం. నిజానికి వైసీసీ అభిమానులు జానారెడ్డికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ల ఓట్లను చీల్చేందుకు కేసీఆరే ఇటుంటి స్కెచ్ వేశారని రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

First Published:  26 March 2021 7:18 AM IST
Next Story