Telugu Global
NEWS

తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్​ టెన్షన్​.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్​..!

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఇవాళ ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొన్నది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలాన్ని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు హర్షం […]

తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్​ టెన్షన్​.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్​..!
X

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఇవాళ ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొన్నది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలాన్ని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేయగా.. నిరుద్యోగులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్​ ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయకుండా .. నిరుద్యోగుల పొట్టగొడుతున్నారని వాళ్లు విమర్శించారు. ఇదిలా ఉంటే ఇవాళ ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అసెంబ్లీని ముట్టడిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ. . సీఎం కేసీఆర్​ నిరుద్యోగుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. వెంటనే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​ త్వరలో నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గత కొంతకాలంగా వివిధ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల కరోనా ఎఫెక్ట్​తో యూనివర్సిటీలు, హాస్టళ్ళు, అన్ని విద్యాసంస్థలను క్లోజ్​చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల కూడా ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. నిన్న ఆందోళన నిర్వహించారు.

మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సైతం ఆందోళనకు దిగారు. లాక్​డౌన్​ తో తాము సర్వస్వం కోల్పోయామని.. ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుస్తుంటే.. మళ్లీ బంద్​ చేయడం సరికాదంటూ వాళ్ల ఆందోళన చేపట్టారు. వెంటనే స్కూళ్లను, విద్యాసంస్థలను తెరవాలని డిమాండ్​ చేశారు. లేదంటే ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీవనభృతిని అందజేయాలని కోరుతున్నారు.

First Published:  26 March 2021 8:51 AM IST
Next Story