Telugu Global
MOVIE REVIEWS

రంగ్ దే మూవీ రివ్యూ

నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్,అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు. కెమెరామెన్ : పీసీ శ్రీరామ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాత :సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్ టైన్ మెంట్స్ రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి రేటింగ్ : 2.5/5 చెప్పాలనుకున్న పాయింట్ ను రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎలాంటి కథాంశాన్నైనా ఎమోషనల్ గా చెప్పొచ్చు. లేదంటే అదే కథా వస్తువును సరదాగా, కామెడీతో నింపి […]

Rang De
X

నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్,అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు.
కెమెరామెన్ : పీసీ శ్రీరామ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత :సూర్యదేవర నాగవంశీ
బ్యానర్: సితార ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
రేటింగ్ : 2.5/5

చెప్పాలనుకున్న పాయింట్ ను రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎలాంటి కథాంశాన్నైనా ఎమోషనల్ గా
చెప్పొచ్చు. లేదంటే అదే కథా వస్తువును సరదాగా, కామెడీతో నింపి చెప్పొచ్చు. కానీ రెండూ మిక్స్ చేసి
చెప్పాలనుకున్నప్పుడు మాత్రం బ్యాలెన్స్ తప్పుకుంది. రంగ్ దే సినిమా ఆ కోవకు చెందినదే.
నితిన్-కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇద్దరి మధ్య గిల్లికజ్జాల్ని సరదాగా చూపించారు. అలానే
కంటిన్యూ చేసుంటే సరిపోయేది. క్లైమాక్స్ కు వచ్చేసరికి భావోద్వేగాలు నింపాలనుకున్నారు. అది అంతగా
రుచించలేదు.

కొన్ని దశాబ్దాల కిందటొచ్చిన ఆనందం, నువ్వే కావాలి లాంటి సినిమాల బాటలోనే రంగ్ దే కూడా
తెరకెక్కింది. కాకపోతే అప్పటి సినిమాలు ఎమోషనల్ గా ఉంటాయి. ఈ తరానికి అంత ఎమోషన్
అక్కర్లేదనుకున్నాడేమో.. కథ-కథనాన్ని కాస్త లైట్ గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. కానీ సినిమా మరీ
లైట్ గా తయారైంది.

అలా లైట్ గా చెప్పే ప్రయత్నంలో పెట్టిన ఫైట్ (సత్యం రాజేష్), ఇంటర్వెల్ సీన్, ప్రెగ్మెన్సీ డ్రామా
లాంటివి కాస్త ఎబ్బెట్టుగా తయారయ్యాయి. ఎలాగూ వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటోళ్లు కామెడీ
పంచుకున్నారు కాబట్టి.. కనీసం ఇలాంటి సన్నివేశాలనైనా సీరియస్ గా చెప్పి ఉంటే బాగుండేది.

పుట్టినప్పటి నుండి అర్జున్ (నితిన్)ను అల్లారుముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులు పక్కింట్లోకి వచ్చిన
అను (కీర్తి సురేష్) మీదకి ఆ ప్రేమని షిఫ్ట్ చేస్తారు. దీంతో అర్జున్ తట్టుకోలేదు. అనుపై ఓ రకమైన ఈర్ష్య,
కోపం పెంచుకుంటాడు. అను మాత్రం అర్జున్ ని వదిలి ఉండలేనంత ప్రేమ పెంచుకుంటుంది.
చిన్నతనం నుండి అనుని ఓ శత్రువులా భావించే అర్జున్, తప్పనిసరి పరిస్థితుల మధ్య అనును
పెళ్లాడతాడు. పెళ్లి చేసుకొని దుబాయ్ లో చదువుకోవడానికెళ్ళిన అను-అర్జున్ ఒకరిపై ఒకరు రివేంజ్
తీర్చుకుంటూ కొట్టుకుంటారు. ఫైనల్ గా అను ప్రేమను తెలుసుకొని అర్జున్ ఆమెకి మంచి భర్తలా ఎలా
మారాడనేది ఈ రంగ్ దే కథ.

సినిమాలో ప్రతి సన్నివేశం ఊహించుకోవచ్చు. నెక్ట్స్ ఏం జరుగుతుందో చిటికెలో చెప్పేయొచ్చు. ఇలాంటి
సన్నివేశాలు పడుతున్నప్పుడు కామెడీని నమ్ముకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. దర్శకుడు అదే
పని చేశాడు. కానీ బ్రహ్మాజీ లాంటి వాళ్లను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు. ఇక హీరోహీరోయిన్ల
విషయానికొస్తే, నితిన్-కీర్తిసురేష్ కెమిస్ట్రీ బాగుంది. ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. వెన్నెల కిషోర్ పంచ్ లు
బాగున్నాయి. నరేష్ ఎప్పట్లానే చేసుకుంటూ వెళ్లిపోయాడు.

టెక్నికల్ గా మాత్రం సినిమా చాలా బాగుంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దానికి పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. నిజానికి వీళ్లిద్దరూ లేకపోతే రంగ్ దే రిజల్ట్ మరింత ఘోరంగా ఉండేదేమో.

ఓవరాల్ గా చూసుకుంటే కథను పట్టించుకోకుండా, కాసిన్ని నవ్వుల కోసం రంగ్ దే సినిమాను ఓసారి చూడొచ్చు.

First Published:  26 March 2021 11:16 AM IST
Next Story