Telugu Global
NEWS

ఆర్డినెన్స్ రూపంలో ఏపీ బడ్జెట్..

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశ పెట్టింది జగన్ సర్కారు. రూ.90వేల కోట్లతో రూపొందిన బడ్జెట్‌ ఆర్డినెన్స్ ‌ను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. సీఎం జగన్‌ పరిశీలన తర్వాత మంత్రులందరికీ ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతులను పంపించారు. మంత్రుల పరిశీలన అనంతరం బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం లభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ కి పంపించాల్సి ఉంది. గవర్నర్ ఆమోదించిన తర్వాత మూడు నెలల […]

ఆర్డినెన్స్ రూపంలో ఏపీ బడ్జెట్..
X

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశ పెట్టింది జగన్ సర్కారు. రూ.90వేల కోట్లతో రూపొందిన బడ్జెట్‌ ఆర్డినెన్స్ ‌ను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. సీఎం జగన్‌ పరిశీలన తర్వాత మంత్రులందరికీ ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతులను పంపించారు. మంత్రుల పరిశీలన అనంతరం బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం లభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ కి పంపించాల్సి ఉంది. గవర్నర్ ఆమోదించిన తర్వాత మూడు నెలల కాలానికి బడ్జెట్ తయారయినట్టే లెక్క. మే నెలాఖరు లేదా జూన్‌లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడతారు.

స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు కరోనా వ్యాక్సినేషన్‌ కారణంగా చూపిస్తూ ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల పథకాల అమలు, ఇతర వ్యయాల నిర్వహణ కోసం 3 నెలల కాలానికి గాను ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ ను ప్రభుత్వం తీసుకువచ్చింది.

గతేడాది కూడా కరోనా కారణంగా ఏపీ బడ్జెట్ ను ఆర్డినెన్స్ రూపంలోనే తీసుకొచ్చారు. 2020 జూన్ తో గడువు ముగిసిపోయిన తర్వాత రూ. 2,24,751.18 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అదే ఆనవాయితీ కొనసాగింది. బడ్జెట్ కి ఆర్డినెన్స్ తప్పసరి అయింది.

టీడీపీ విమర్శలు..
వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకు రావడాన్ని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఈసారయినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఆర్థికమంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. బడ్జెట్ వాయిదా వేసి, ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని పలాయనవాదంగా ఆయన అభివర్ణించారు. ఇది ఓ దుష్ట సంప్రదాయం అని మండిపడ్డారు.

First Published:  26 March 2021 10:07 AM IST
Next Story