హీరోహీరోయిన్లు నమ్మిన కథ
ఓ కథపై అందరికంటే ముందుగా దర్శకుడికి నమ్మకం ఉంటుంది. అయితే రంగ్ దే విషయంలో మాత్రం తనకంటే హీరోహీరోయిన్లు నితిన్, కీర్తిసురేష్ కే ఈ కథపై ఎక్కువ నమ్మకం అంటున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. రంగ్ దే రిలీజ్ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. “నితిన్ నాకు పదిహేనేళ్లుగా పరిచయం. అందువల్ల నాకు తనతో సెట్స్ మీద చాలా సౌకర్యంగా అనిపించింది. కీర్తి విషయానికి వస్తే, ఆమె వెనుక ‘మహానటి’తో వచ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా […]
ఓ కథపై అందరికంటే ముందుగా దర్శకుడికి నమ్మకం ఉంటుంది. అయితే రంగ్ దే విషయంలో మాత్రం
తనకంటే హీరోహీరోయిన్లు నితిన్, కీర్తిసురేష్ కే ఈ కథపై ఎక్కువ నమ్మకం అంటున్నాడు దర్శకుడు వెంకీ
అట్లూరి. రంగ్ దే రిలీజ్ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
“నితిన్ నాకు పదిహేనేళ్లుగా పరిచయం. అందువల్ల నాకు తనతో సెట్స్ మీద చాలా సౌకర్యంగా అనిపించింది. కీర్తి విషయానికి వస్తే, ఆమె వెనుక ‘మహానటి’తో వచ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫర్ట్ అట్మాస్పియర్‌ను ఆమె క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్దరితో చాలా సౌకర్యంగా ఈ సినిమా చేశాను. నా కంటే ఈ సబ్జెక్టును నితిన్, కీర్తి గట్టిగా నమ్మారు. షూటింగ్ జరుగుతున్నంత సేపూ కథ గురించి, సన్నివేశాల గురించి నాతో బాగా డిస్కస్ చేస్తూ వచ్చారు. అర్జున్, అను పాత్రలను వారు బాగా చేశారు అనేకంటే ఆ పాత్రల్లో వాళ్లు బాగా ఇన్‌వాల్వ్ అయ్యారనడం కరెక్టుగా ఉంటుంది.”
నిజానికి ఈ సినిమాలో ముందుగా నితిన్ ను హీరోగా అనుకోలేదని బయటపెట్టాడు వెంకీ. సితార నిర్మాతలు చెప్పడంతో నితిన్ కు కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయాయని అంటున్నాడు.
“నిజానికి నేను ఈ కథ రాసుకున్న తర్వాత మొదట నితిన్‌ను కాకుండా వేరే హీరోలను అనుకున్నాను. ఈ సినిమా చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుకు వచ్చాక, నితిన్ పేరును నిర్మాత నాగవంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోననే సందేహంతోనే నేను కథ చెప్పాను. తను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయడంతో నమ్మలేకపోయాను. కథను ఆయన అంతగా నమ్మాడు. నితిన్, కీర్తి అంతగా ఈ కథను నమ్మడంతో వాళ్ల పాత్రలతో మరింత బాగా ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేశాక నా సినిమాలకు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై నా నమ్మకం ఇంకా పెరిగింది.”
రంగ్ దే తర్వాత సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైనే మరో సినిమా చేయబోతున్నాడు వెంకీ. కాకపోతే ఆ సినిమాలో దిల్ రాజు కూడా భాగస్వామిగా వ్యవహరిస్తాడు.