Telugu Global
National

కంపెనీల మధ్య వ్యాక్సినేషన్ పోటీ..

మా ఆఫీస్ లో అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు, మాది కరోనా ఫ్రీ ఆఫీస్. మా కంపెనీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయించాం. మాది కరోనా ఫ్రీ కంపెనీ. ఇకపై ఇలాంటి స్లోగన్లు వినిపించబోతున్నాయి. మాదీ ఐఎస్ఓ స్టాండర్డ్ కంపెనీ అని చెప్పుకునేవారంతా ఇప్పుడు మాది పూర్తి వ్యాక్సినేటెడ్ కంపెనీ అని చెప్పుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్, 60ఏళ్లు పైబడిన వారు, 45ఏళ్ల పైబడిన వ్యాధిగ్రస్థులకు టీకా అని చెప్పిన సర్కారు.. పూర్తిగా […]

కంపెనీల మధ్య వ్యాక్సినేషన్ పోటీ..
X

మా ఆఫీస్ లో అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు, మాది కరోనా ఫ్రీ ఆఫీస్. మా కంపెనీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయించాం. మాది కరోనా ఫ్రీ కంపెనీ. ఇకపై ఇలాంటి స్లోగన్లు వినిపించబోతున్నాయి. మాదీ ఐఎస్ఓ స్టాండర్డ్ కంపెనీ అని చెప్పుకునేవారంతా ఇప్పుడు మాది పూర్తి వ్యాక్సినేటెడ్ కంపెనీ అని చెప్పుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్, 60ఏళ్లు పైబడిన వారు, 45ఏళ్ల పైబడిన వ్యాధిగ్రస్థులకు టీకా అని చెప్పిన సర్కారు.. పూర్తిగా జనసామాన్యంలోకి వ్యాక్సిన్ ని వదిలేసింది. 45ఏళ్లు పైబడినవారందరూ టీకా వేయించుకోవచ్చని చెప్పింది. ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసి సచివాలయాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. అటు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వ్యాక్సిన్ పంపిణీ అవకాశం ఇవ్వడంతో సాధారణ పౌరులు సైతం టీకా వేయించుకుంటున్నారు. వృథాను అరికట్టడంలో భాగంగా వయసు నిబంధ‌న‌ పక్కనపెట్టి, ఇలా అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పేందుకు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా ప్రత్యామ్నాయాన్ని వెతికి పెట్టుకున్నాయి.

వ్యాక్సిన్ జనసామాన్యంలోకి వచ్చే సరికి కంపెనీలు తమ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయించడానికి ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సర్వీసులు అందిస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థలు, షాపింగ్ మాల్స్, షోరూమ్ లు నిర్వహించే కంపెనీలు.. ఈ విషయంలో చొరవ చూపిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని ప్రకటించింది. టీకా ఖర్చులను కంపెనీయే భరిస్తుందని ఆ సంస్థ సీఈవో చెప్పారు. టీకా కోసం సెలవు ఇవ్వడంతోపాటు, సిబ్బందికి ఆరోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. దీనికోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. స్విగ్గీ తాజా నిర్ణయంతో సుమారు 2 లక్షల డెలివరీ పాట్న‌ర్ల‌కు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులపై ఉన్న ప్రేమని కాదనలేం కానీ.. అదే సమయంలో స్విగ్గీ నుంచి వచ్చే ఫుడ్ ఐటమ్స్ తో కరోనా ముప్పు తక్కువ అనే ప్రచారం కూడా జరిగిపోతుంది. అందుకే కంపెనీలు ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

అటు పలు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా టీచర్లు, ఇతర స్టాఫ్ కి వ్యాక్సిన్ వేయించడానికి సిద్ధమవుతున్నాయి. ఇకపై మా స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారనేది వీరి ప్రచారంలో ప్రధానంగా ఉంటుందనమాట. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, షోరూమ్ లు ఇలా.. అన్ని చోట్లా సిబ్బందికి వ్యాక్సిన్ వేయించడానికి యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇకపై మా షాపులో అందరికీ వ్యాక్సిన్ వేయించాం, మాది సురక్షిత ప్రాంతం అని బయట బోర్డులు పెడతారనమాట.

First Published:  25 March 2021 5:05 AM IST
Next Story