Telugu Global
Cinema & Entertainment

రిపబ్లిక్ మూవీ ఫస్ట్ లుక్

“74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకున్నాం. కానీ మనకింకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు.” సాయితేజ్ కొత్త సినిమాలో డైలాగ్ ఇది. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు దేవకట్టా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్ కూడా రివీల్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో హీరో సాయితేజ్ కూలింగ్ గ్లాస్ వేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ లుక్‌తో ఆడియెన్స్‌లో […]

రిపబ్లిక్ మూవీ ఫస్ట్ లుక్
X

“74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకున్నాం. కానీ మనకింకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో
కూడా తెలియదు.”

సాయితేజ్ కొత్త సినిమాలో డైలాగ్ ఇది. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు దేవకట్టా.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్ కూడా రివీల్
చేశారు.

ఫ‌స్ట్ లుక్‌లో హీరో సాయితేజ్ కూలింగ్ గ్లాస్ వేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ లుక్‌తో ఆడియెన్స్‌లో ఓ
క్యూరియాసిటినీ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ దేవ్‌క‌ట్ట‌. ఫ‌స్ట్‌లుక్‌ను ప‌రిశీలిస్తే… కూలింగ్ గ్లాస్‌లో హీరో ఎవ‌రితో
చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో
న‌టిస్తున్నారు.

First Published:  25 March 2021 3:40 PM IST
Next Story