Telugu Global
Health & Life Style

లెగ్యూమ్స్ తింటున్నారా?

పోషకాలు నిండుగా ఉండే ఆహారాల్లో లెగ్యూమ్స్ కేటగిరీ కూడా ఒకటి. పోషకాల కోసం ఎప్పుడూ మాంసం మీదే ఆధారపడకుండా.. లెగ్యూమ్స్ జాతి గింజల ద్వారా ఆరోగ్యకరమైన పోషకాలు పొందొచ్చు బఠానీలు, సోయాబీన్స్, రెడ్ బీన్స్, కిడ్నీ బీన్స్, తెలుపు, నలుపు, ఎరుపు, తెలుపుపై ​​ఎరుపు మచ్చలుండేవి ఇలా బోలెడు రకాల బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ పల్సె్స్, లెగ్యూమ్స్ కిందకు వస్తాయి. వీటితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. బీన్స్ జాతి విత్తనాలు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని […]

లెగ్యూమ్స్ తింటున్నారా?
X

పోషకాలు నిండుగా ఉండే ఆహారాల్లో లెగ్యూమ్స్ కేటగిరీ కూడా ఒకటి. పోషకాల కోసం ఎప్పుడూ మాంసం మీదే ఆధారపడకుండా.. లెగ్యూమ్స్ జాతి గింజల ద్వారా ఆరోగ్యకరమైన పోషకాలు పొందొచ్చు బఠానీలు, సోయాబీన్స్, రెడ్ బీన్స్, కిడ్నీ బీన్స్, తెలుపు, నలుపు, ఎరుపు, తెలుపుపై ​​ఎరుపు మచ్చలుండేవి ఇలా బోలెడు రకాల బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ పల్సె్స్, లెగ్యూమ్స్ కిందకు వస్తాయి. వీటితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

బీన్స్ జాతి విత్తనాలు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని , క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ మాక్రోమాలుక్యులర్‌’లో ఒక అధ్యయనం తెలిపింది. అంతేకాదు, ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
లెగ్యూమ్స్ కండరాల వ్యవస్థను బలపరుస్తాయి. శరీర కణజాలాలకు, కావాల్సినంత ప్రోటీన్ వీటి ద్వారా లభిస్తుంది.

లెగ్యూమ్స్ లో ప్రొటీన్స్‌తో పాటు, తొమ్మిది ముఖ్యమైన అమైనో గ్రూప్ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.కాబట్టి వీటితో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
లెగ్యూమ్స్ యాంటీ-ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
లెగ్యూమ్స్ లో ఫైబర్ శాతం కూడా ఎక్కువే. అందుకే రోజూ ఉదయం లేదా సాయత్రం స్నాక్స్‌లాగా వీటిని తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.

First Published:  25 March 2021 9:00 AM IST
Next Story