యాంటీబాడీలపై కొత్త స్టడీ ఏం చెప్తుందంటే..
వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు అందరిలో ఒకేలా ఉండవని రీసెంట్ స్టడీ చెప్తోంది. ఇవి కొందరిలో కొన్ని రోజులే ఉండొచ్చని మరికొంతమందిలో దశాబ్దం పాటు కూడా ఉండొచ్చని తాజా అధ్యయనం చెప్తోంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది […]
వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు అందరిలో ఒకేలా ఉండవని రీసెంట్ స్టడీ చెప్తోంది. ఇవి కొందరిలో కొన్ని రోజులే ఉండొచ్చని మరికొంతమందిలో దశాబ్దం పాటు కూడా ఉండొచ్చని తాజా అధ్యయనం చెప్తోంది.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.
సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది కోవిడ్ రోగులపై తొమ్మిది నెలల పాటు స్టడీ నిర్వహించారు. ఇందులో 11.6 శాతం మందికి అసలు యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదు. అలాగే 26.8 శాతం వారికి యాంటీ బాడీలు ఉత్పత్తి అయినప్పటికీ అవి త్వరగా క్షీణిస్తే, 29 శాతం మందిలో మాత్రం నెమ్మదిగా క్షీణించడం కనిపించింది. ఇక 1.8శాతం మందిలో మాత్రం యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయన్నది వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని తేలింది.