వకీల్ సాబ్ ట్రయిలర్ వచ్చేస్తోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. నిజానికి ఈ సినిమా ట్రయిలర్ గతేడాది క్రిస్మస్ కు వస్తుందనుకున్నారు. కనీసం సంక్రాంతి కానుకగా ట్రయిలర్ రిలీజ్ చేస్తారని భావించారు. కానీ రిలీజ్ కు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్
రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల
ముందుకొస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.
నిజానికి ఈ సినిమా ట్రయిలర్ గతేడాది క్రిస్మస్ కు వస్తుందనుకున్నారు. కనీసం సంక్రాంతి కానుకగా
ట్రయిలర్ రిలీజ్ చేస్తారని భావించారు. కానీ రిలీజ్ కు చాలా టైమ్ ఉండడంతో ట్రయిలర్ రెడీ
అయినప్పటికీ రిలీజ్ చేయలేదు. ఎట్టకేలకు ట్రయిలర్ విడుదల తేదీని ప్రకటించారు.
దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు
పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ
అంచనాలున్నాయి. ట్రైలర్ క్లిక్ అయితే ఈ అంచనాలు మరింత పెరుగుతాయి.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య
నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.