Telugu Global
NEWS

సాగర్ పై టీఆర్ఎస్ లో తర్జన భర్జన..

దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి, ప్రచార పర్వాన్ని కూడా మొదలు పెట్టిన టీఆర్ఎస్, నాగార్జున సాగర్ విషయంలో మాత్రం పూర్తిగా డైలమాలో పడింది. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అధికార పార్టీ, అందులోనూ.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్లా విజయం సాధించిన పార్టీ.. ఇలా మీనమేషాలు లెక్కిస్తుండటంతో పార్టీ శ్రేణులు కూడా ఆలోచనలో పడ్డాయి. అసలింతకీ సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కేసీఆర్ […]

సాగర్ పై టీఆర్ఎస్ లో తర్జన భర్జన..
X

దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి, ప్రచార పర్వాన్ని కూడా మొదలు పెట్టిన టీఆర్ఎస్, నాగార్జున సాగర్ విషయంలో మాత్రం పూర్తిగా డైలమాలో పడింది. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అధికార పార్టీ, అందులోనూ.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్లా విజయం సాధించిన పార్టీ.. ఇలా మీనమేషాలు లెక్కిస్తుండటంతో పార్టీ శ్రేణులు కూడా ఆలోచనలో పడ్డాయి. అసలింతకీ సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కేసీఆర్ ఆలోచన ఏంటి? మూడుసార్లు సర్వే చేసినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరో శాంపిల్ సర్వే ఎందుకు చేయించారు? టీఆర్ఎస్ అధినాయకత్వం మరీ ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తోంది..?

దుబ్బాక పరాజయాన్ని మరచిపోలేదా..?
దుబ్బాకలో సోలిపేట లింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుజాత రెడ్డిని బరిలో దింపింది అధికార టీఆర్ఎస్ పార్టీ. 2018లో జరిగిన ఎన్నికల్లో లింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి కేవలం 22,595 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి చోటే రెండేళ్లలో ఫలితం తారుమారైంది. ఉప ఎన్నికల్లో సింపతీ ప్రభావం పనిచేయలేదు.

నాగార్జున సాగర్ లో అద్భుతాలు జరుగుతాయా..?
ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే సాగర్ లో టీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్న మాట వాస్తవమే. అయితే ఇక్కడ బీజేపీకంటే కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి మరింత బలంగా ఉన్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టి, ప్రచారంతో కనికట్టు చేస్తే టీఆర్ఎస్ పని కష్టమే. అందుకే అభ్యర్థి విషయంలో ఇంకా అధికార పార్టీ ఫైనల్ డెసిషన్ తీసుకోలేకపోతోంది. ముందు బీజేపీ అభ్యర్థి ఎవరో తేలితే.. దాన్ని బట్టి చివరి నిముషంలో తమ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. ప్రస్తుతానికయితే నర్సింహయ్య కొడుకు భగత్‌ పేరు ఫైనల్ అయ్యేలా ఉంది. మన్నెం రంజిత్‌ యాదవ్‌, గురవయ్య యాదవ్‌, శ్రీనివాస్ ‌యాదవ్‌, బాలరాజ్‌ యాదవ్‌, తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి.. పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే.. వేచి చూడటమే ఉత్తమం అనుకుంటున్న కేసీఆర్, నామినేషన్లు ప్రారంభమైనా నింపాదిగా ఉన్నారు.

First Published:  23 March 2021 11:55 PM GMT
Next Story