కార్తి సుల్తాన్ ట్రయిలర్ రివ్యూ
కార్తి, రష్మిక హీరోహీరోయిన్లుగా కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ రోజు సుల్తాన్ ట్రైలర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. అది ఒక ఏనుగు గుంపు..అంటూ విలన్ (కె.జి.యఫ్ ఫేమ్ […]
కార్తి, రష్మిక హీరోహీరోయిన్లుగా కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ రోజు సుల్తాన్ ట్రైలర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్.
అది ఒక ఏనుగు గుంపు..అంటూ విలన్ (కె.జి.యఫ్ ఫేమ్ రామచంద్రరాజు) వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన 2 నిమిషాల 16 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆధ్యంతం ఎంటర్‌టైనింగ్ గా సాగింది. హీరోయిన్ రష్మిక పల్లెటూరి యువతి క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. తమిళ సీనియర్ యాక్టర్ నెపోలియన్, మలయాళం పాపులర్ యాక్టర్ లాల్ పాత్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఎప్పట్లాగే యోగిబాబు మరోసారి ట్రైలర్‌లో నవ్వులు పూయించారు. ఏదో కారణం చేత తమ ఊరికి వచ్చిన వంద మంది రౌడిలను లీడ్ చేసే సుల్తాన్‌గా కార్తి కనిపిస్తున్నారు. వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. మొత్తంగా ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కార్తి కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లలో ఈ మూవీ రిలీజవుతుంది.