Telugu Global
NEWS

మండుతున్న వంటింటి ధరలు..

ఓ వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంటే.. మరోవైపు మెల్లగా నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. వంట నూనె ధరలు చూస్తుండగానే అమాంతం పెరిగిపోయాయి. కోవిడ్‌ లాక్‌డౌన్ కాలంలో ఆహార ధాన్యాలు, పప్పులు విపరీతంగా అమ్ముడుపోవడం వల్ల కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో పప్పులు, గింజల నిల్వలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. అలాగే లాక్‌డౌన్‌లో క్వారంటైన్‌లో ఉన్న రోగులకు అందించడానికి ప్రభుత్వాలు కూడా భారీగానే ఆహార ధాన్యాలు కొనుగోలు చేశాయి. దాంతో తిండి గింజల నిల్వలు అడుగంటాయి. వాటిని […]

మండుతున్న వంటింటి ధరలు..
X

ఓ వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంటే.. మరోవైపు మెల్లగా నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. వంట నూనె ధరలు చూస్తుండగానే అమాంతం పెరిగిపోయాయి.

కోవిడ్‌ లాక్‌డౌన్ కాలంలో ఆహార ధాన్యాలు, పప్పులు విపరీతంగా అమ్ముడుపోవడం వల్ల కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో పప్పులు, గింజల నిల్వలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. అలాగే లాక్‌డౌన్‌లో క్వారంటైన్‌లో ఉన్న రోగులకు అందించడానికి ప్రభుత్వాలు కూడా భారీగానే ఆహార ధాన్యాలు కొనుగోలు చేశాయి. దాంతో తిండి గింజల నిల్వలు అడుగంటాయి. వాటిని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి భారీగా కొనుగోళ్లు, దిగుమతులు జరిపాయి. ఇదే ఇప్పుడు ఆహార ధరలు పెరగడానికి కారణమైంది. కోవిడ్ కాలంలో తగ్గిపోయిన నిల్వల కారణంగా భారత్ తో పాటు అన్ని దేశాలు ఆహార దిగుమతులను పెంచుకోక తప్పలేదు.

గతేడాది డిసెంబరుతో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో ఆహార ధాన్యాలు, నూనె గింజలు, మాంసం, పాలు, చక్కెర ధరలు 4.3శాతం పెరిగాయని ఎఫ్ఏఓ తాజా ఆహార ధరల నివేదిక సూచించింది. ప్రస్తుతం వంట నూనె ధరలు సలసల మరుగుతున్నాయి. వీటి ధరలు నాలుగు నెలల్లో విపరీతంగా పెరిగిపోయాయి. లీటరుకు రూ.30 నుంచి 50 వరకు పెరిగింది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.105 నుండి 185 కు చేరింది.

పప్పుల ధరలు కూడా ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. శనగపప్పు కేజీ రూ. 90 వరకూ ఉంది. కందిపప్పు రెండు నెల క్రితం రూ.110 ఉంటే ఇప్పుడు రూ.150 వరకూ ఉంది. పెసరపప్పు కేజీ రూ.150 ఉంది. అలాగే పల్లీలు క్వాలిటీని బట్టి కేజీ రూ.150 నుంచి రూ.200 వరకూ ఉన్నాయి. అయితే పప్పులు, నూనెలు, చక్కర లాంటి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం, వాటిపై పన్నులు తగ్గిస్తే ఈ ధరలు కొంతవరకైనా తగ్గొచ్చని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

First Published:  24 March 2021 9:34 AM IST
Next Story