Telugu Global
NEWS

బీజేపీ ఎత్తులకు .. కేసీఆర్​ పై ఎత్తు..!

ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్​ టాపిక్​గా మారింది. కాంగ్రెస్​ అభ్యర్థిగా జానారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇక టీఆర్​ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. సాగర్​ స్థానం నుంచి టీఆర్​ఎస్​ టికెట్​ను చాలా మంది ఆశిస్తున్నారు. కానీ బీజేపీ.. మాత్రం ఇతర పార్టీల నేతల కోసం ఎదురుచూస్తున్నది. సూటిగా చెప్పాలంటే .. టీఆర్​ఎస్ ఓ అభ్యర్థిని ఎంపిక చేస్తే.. అక్కడి అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలన్నది బీజేపీ […]

బీజేపీ ఎత్తులకు .. కేసీఆర్​ పై ఎత్తు..!
X

ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్​ టాపిక్​గా మారింది. కాంగ్రెస్​ అభ్యర్థిగా జానారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇక టీఆర్​ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. సాగర్​ స్థానం నుంచి టీఆర్​ఎస్​ టికెట్​ను చాలా మంది ఆశిస్తున్నారు. కానీ బీజేపీ.. మాత్రం ఇతర పార్టీల నేతల కోసం ఎదురుచూస్తున్నది. సూటిగా చెప్పాలంటే .. టీఆర్​ఎస్ ఓ అభ్యర్థిని ఎంపిక చేస్తే.. అక్కడి అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలన్నది బీజేపీ ఆలోచన. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్​.. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేశారు. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్​లో పెట్టనున్నట్లు సమాచారం.

నామినేషన్​కు ఆఖరి రోజున ఆయన అభ్యర్థిని ఖరారు చేస్తారు. అప్పటివరకు టీఆర్​ఎస్​ ఆశావహులకు విషయం చెప్పరు. ఒకవేళ ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే.. అసంతృప్తులు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్​ ఈ వ్యూహం అమలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్​ వ్యూహంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉన్నది. సరిగ్గా చివరిరోజు టీఆర్​ఎస్​ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

టీఆర్​ఎస్​ నుంచి తేరా చిన్నప్పరెడ్డి.. మరికొందరు నేతలు టికెట్​ను ఆశిస్తున్నారు. అయితే తేరా చిన్నప్పరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం వస్తుందా? లేదా? అన్న విషయం గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు నేతలు కూడా టికెట్​ ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నది. ఒకవేళ టీఆర్​ఎస్​ నుంచి టికెట్​ దక్కని వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నది.

టీఆర్​ఎస్​ నుంచి నోముల నర్సింహయ్య తనయుడు కూడా టికెట్​ ఆశిస్తున్నారు. అయితే టీఆర్​ఎస్​ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే టికెట్​ ఇవ్వకపోతే సదరు నేతలు రెబల్​గా పోటీచేసే అవకాశం ఉంది. లేదంటే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే ఛాన్స్​ ఉంది. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆ పార్టీకి నష్టమే. కాబట్టి ఆఖరిరోజే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి సాగర్​లో పెద్దగా బలంగా లేదు. ఆ పార్టీకి అక్కడ క్యాడర్​ కూడా లేదు. దీంతో పక్కపార్టీ వైపు చూస్తున్నది. ఒకవేళ ఇతర పార్టీల నుంచి ఎవరూ వలసలు రాకపోతే .. కంకణాల నివేదితరెడ్డికి అవకాశం ఉంది.

First Published:  24 March 2021 2:50 PM IST
Next Story