రామ్ చరణ్ సరసన మరోసారి...!
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో #RC15 సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. మొన్నటి వరకు సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కొరియన్ బ్యూటీ సుజీ బే పేరు వినిపించగా ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ […]
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో #RC15 సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో
దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు కాస్ట్ అండ్ క్రూ ని
ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్.
మొన్నటి వరకు సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కొరియన్ బ్యూటీ సుజీ బే పేరు వినిపించగా ఇప్పుడు
బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే ప్రచారం జరుగుతుంది.
శంకర్ సినిమా అంటే ఎంత లేదన్నా పూర్తవ్వడానికి ఏడాది పైనే పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ
డేట్స్ ఇచ్చే హీరోయిన్ అవసరం. ప్రస్తుతం బాలీవుడ్ లో కియరా బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో ఆమె
శంకర్-చరణ్ సినిమాకు డేట్స్ బల్క్ లో డేట్స్ కేటాయిస్తుందా అనేది అనుమానం.
ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయితే మరోసారి చరణ్- కియరా జోడి స్క్రీన్ పై మెరవనుంది.
గతంలో వీళ్లిద్దరూ కలిసి వినయవిధేయరామ అనే సినిమాలో నటించారు.