ఎన్టీఆర్, పవన్ మూవీ అప్ డేట్స్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు? పవన్ కల్యాణ్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ అప్ డేట్స్ ఏంటి? మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ గా పేరుతెచ్చుకున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్ డేట్ వచ్చింది. ఈరోజు మీడియాతో మాట్లాడిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు కీలకమైన అప్ డేట్స్ ఇచ్చాడు. ముందుగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ విషయానకొద్దాం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెల నుంచి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు […]
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు? పవన్ కల్యాణ్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ అప్ డేట్స్ ఏంటి?
మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ గా పేరుతెచ్చుకున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్ డేట్
వచ్చింది. ఈరోజు మీడియాతో మాట్లాడిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ రెండు సినిమాలకు
సంబంధించి రెండు కీలకమైన అప్ డేట్స్ ఇచ్చాడు.
ముందుగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ విషయానకొద్దాం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెలాఖరు లేదా మే
నెల నుంచి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు నాగవంశీ. ఒకసారి సెట్స్ పైకి వెళ్తే.. దాదాపు 50శాతం షూటింగ్
పూర్తయ్యేవరకు విరామం ఇచ్చేది లేదని కూడా స్పష్టంచేశాడు. ఎందుకంటే, ఈ సినిమా ఇప్పటికే
ఆలస్యమౌతోంది.
అటు పవన్ కల్యాణ్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పై కూడా స్పందించాడు. అంతా
అనుకుంటున్నట్టు పవన్ సరసన హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకోలేదని స్పష్టంచేశాడు నాగవంశీ.
త్వరలోనే హీరోయిన్ ను ఎంపిక చేస్తామన్నాడు. మరోవైపు రానా సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను
తీసుకున్నామని తెలిపాడు.