పనబాక లక్ష్మి.. మరో సుహాసిని కాబోతుందా?
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్నది. టీడీపీ, వైసీసీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మికే టికెట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. పనబాక లక్ష్మికి అస్సలు ఈ ఎన్నికల్లో పోటీచేయడం ఇష్టం లేదని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టుకున్నానని.. ప్రస్తుతం తన […]
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్నది. టీడీపీ, వైసీసీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మికే టికెట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
అయితే.. పనబాక లక్ష్మికి అస్సలు ఈ ఎన్నికల్లో పోటీచేయడం ఇష్టం లేదని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టుకున్నానని.. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ఆమె వ్యాఖ్యానించారట. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఆమెకే టికెట్ ఇచ్చారు. పనబాక పార్టీ మారబోతున్నట్టు అప్పట్లో వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అప్రమత్తమైన బాబు ఆమెను ఎంపికచేశారు. ఇదిలా ఉంటే సోషల్మీడియాలో ఈ ఎన్నికపై ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తున్నది.
గతంలో ఓటమి ఖాయమని తెలిసినా తెలంగాణలోని కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని ఎలాగైతే పోటీచేయించారో? ఇప్పుడు కూడా ఓడిపోతుందని తెలిసినా పనబాక లక్ష్మినే పోటీకి దించుతున్నారని కొందరు అంటున్నారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఇక్కడ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద ధీమాతో ఉన్నది. భారీ మెజార్టీ.. అంటే రికార్డు మెజార్టీ తీసుకురావాలని సీఎం జగన్ మంత్రులకు ఆదేశించారు. ఇందుకోసం అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు సైలెంట్ గానే ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారం కూడా చేసుకోవడం లేదు.మరోవైపు ఇక్కడ తొలుత జనసేన పోటీచేస్తుందని అంతా భావించారు, కానీ ఆఖరి నిమిషంలో బీజేపీకి సీటు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీచేస్తారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
గత మున్సిపల్ ఎన్నికల ముందు ఏపీలో గుడులు, ప్రార్థనామందిరాలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ బీజేపీకి కలిసి రాలేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని పేర్కొన్నారు.