Telugu Global
Cinema & Entertainment

పెళ్లి తర్వాత సన్నబడిన నితిన్.. కారణం ఏంటి?

ప్రశ్న – పెళ్లి తర్వాత బాగా సన్నబడ్డారు.. ఏంటి కారణం? నితిన్ – పెళ్లి తర్వాత ఇంట్లో ప‌నిచేసి, బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయాను. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నితిన్ చిలిపి సమాధానం ఇది. నిజంగానే నితిన్ బాగా స్లిమ్ అయిపోయాడు. కానీ ఆ ఫిజిక్ కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. “ప్రస్తుతం నేను 30ల్లో ఉన్నాను. ఈ వయసులో స్లిమ్ గా అవ్వడం కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. జిమ్ లో ఇంకాస్త ఎక్కువ […]

పెళ్లి తర్వాత సన్నబడిన నితిన్.. కారణం ఏంటి?
X

ప్రశ్న – పెళ్లి తర్వాత బాగా సన్నబడ్డారు.. ఏంటి కారణం?
నితిన్ – పెళ్లి తర్వాత ఇంట్లో ప‌నిచేసి, బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయాను.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నితిన్ చిలిపి సమాధానం ఇది. నిజంగానే నితిన్ బాగా స్లిమ్ అయిపోయాడు. కానీ ఆ ఫిజిక్ కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు.

“ప్రస్తుతం నేను 30ల్లో ఉన్నాను. ఈ వయసులో స్లిమ్ గా అవ్వడం కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. జిమ్ లో ఇంకాస్త ఎక్కువ సేపు గడపాల్సి వచ్చింది. అలా కొన్ని కిలోల బరువు తగ్గాను. దీనికితోడు షేవ్ కూడా చేయడంతో ఇంకాస్త స్లిమ్ గా కనిపించినట్టయింది.”

ఇలా తను కావాలనే స్లిమ్ గా మారాననే విషయాన్ని బయటపెట్టాడు నితిన్. అయితే ఇదంతా రంగ్ దేలో తను పోషించిన పాత్ర కోసం మాత్రమేనని చెప్పుకొచ్చాడు.

“అప్పుడెప్పుడో 16 ఏళ్ల కిందట కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాను. మళ్లీ ఇన్నాళ్లకు రంగ్ దేలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాల్సి వచ్చింది. అందుకే కష్టపడి బరువు తగ్గాను.”

ఇలా తను స్లిమ్ అవ్వడం వెనక రీజన్ ను బయటపెట్టాడు ఈ హీరో. ఇదే సినిమాలో కీర్తిసురేష్ కూడా స్లిమ్ లుక్ లో కనిపించబోతోంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమా 26న రిలీజ్ అవుతోంది.

First Published:  22 March 2021 1:59 AM IST
Next Story