Telugu Global
NEWS

ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు 30శాతం ఫిట్ మెంట్ కి ఓకే..

ప్రచారంలో ఉన్న అంశాలన్నీ నిజాలయ్యాయి. తెలంగాణ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ 30శాతం ఫిట్ మెంట్ వ్యవహారంపై లీకులిచ్చారు. పదవీ విరమణ వయసు 61కి పెంచే విషయంపై కూడా హింట్ ఇచ్చారు. ఈ హామీలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒడ్డునపడిందనేవారు కూడా ఉన్నారు. అయితే ఆ హామీలు అమలవుతాయా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఆ […]

ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు 30శాతం ఫిట్ మెంట్ కి ఓకే..
X

ప్రచారంలో ఉన్న అంశాలన్నీ నిజాలయ్యాయి. తెలంగాణ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ 30శాతం ఫిట్ మెంట్ వ్యవహారంపై లీకులిచ్చారు. పదవీ విరమణ వయసు 61కి పెంచే విషయంపై కూడా హింట్ ఇచ్చారు. ఈ హామీలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒడ్డునపడిందనేవారు కూడా ఉన్నారు. అయితే ఆ హామీలు అమలవుతాయా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ అసెంబ్లీలో ఫిట్ మెంట్ పై ప్రకటన చేశారు.

గతంలో పీఆర్సీకోసం వేసిన బిశ్వాల్ కమిటీ.. తెలంగాణ ఉద్యోగులకు 7.5శాతం ఫిట్ మెంట్ ఇవ్వొచ్చని సూచించింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగుల గొంతు కోస్తారా అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యక్షంగానే కేసీఆర్ పై రుసరుసలాడారు. అప్పుల్లో ఉన్న పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఉద్యోగుల డిమాండ్లు నెరవేరుతున్నాయని, తెలంగాణలో మాత్రం ఇంత దారుణం ఏంటని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు దానిపై తేల్చని కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫిట్ మెంట్ 30శాతం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీని నేడు అమలులో పెట్టారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలులోకి వస్తుందని తెలిపారు కేసీఆర్. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందని సర్ది చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని గుర్తు చేసిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీఎన్జీవో పేరు మార్చుకోలేదని ఉద్యమ నేతల్ని కొనియాడారు.

తెలంగాణ పీఆర్సీ ముఖ్యాంశాలు..
– ఏప్రిల్ 1నుంచి పీఆర్సీ అమలు, ఫిట్ మెంట్ 30శాతం.
– ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ ‌దారులు, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోంగార్డులకు కూడా పీఆర్సీ వర్తింపు.
– అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేబీబీవీ సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకారమే పే స్కేల్.
– ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంపు.
– ఉద్యోగులు కోరిన విధంగానే పదోన్నతుల ప్రక్రియ, అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు. తక్షణమే పదోన్నతుల ప్రక్రియ అమలు.

First Published:  22 March 2021 9:02 AM IST
Next Story