'చల్లగా' కవర్ చేశారు.. వేడివేడిగా దొరికిపోయారు
ఈ కాలం సినిమా ప్రచారం ఏ రేంజ్ లో చేయాలో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. ఇలాంటి ట్రెండ్స్ అందుకోవడంలో ‘గీతా కాంపౌండ్’ ఎప్పుడూ ముందుంటుంది. ఆ బ్యానర్ పై వచ్చే సినిమాలకు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ అతి ప్రచారం, పెయిడ్ ప్రమోషన్ పక్కదారి పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సరిగ్గా చావు కబురు చల్లగా సినిమా విషయంలో అదే […]
ఈ కాలం సినిమా ప్రచారం ఏ రేంజ్ లో చేయాలో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. ఇలాంటి ట్రెండ్స్ అందుకోవడంలో ‘గీతా కాంపౌండ్’ ఎప్పుడూ ముందుంటుంది. ఆ బ్యానర్ పై వచ్చే సినిమాలకు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ అతి ప్రచారం, పెయిడ్ ప్రమోషన్ పక్కదారి పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సరిగ్గా చావు కబురు చల్లగా సినిమా విషయంలో అదే జరిగింది.
ఈ సినిమాకు అన్ని రకాలుగా ప్రచారం కల్పించింది గీతాఆర్ట్స్ సంస్థ. అయితే సరిగ్గా విడుదల రోజు చేయాలనుకున్న ఓ ”ప్రత్యేక ప్రచారం” మాత్రం దారుణంగా బెడిసికొట్టింది. సినిమాలో కీలకమైన క్లైమాక్స్ కు ఎలివేషన్ ఇచ్చేందుకు #ClimaxBastiBalaraju అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు పెయిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. సరిగ్గా ఇక్కడే అడ్డంగా దొరికిపోయింది.
క్లైమాక్స్ చాలా బాగుందంటూ, కార్తికేయ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ తెలుగులో రాసిన ఓ ట్వీట్ ను ఇతర భాషలకు చెందిన వ్యక్తులతో వేయించారు. వీళ్లలో హిందీ జనాలు, తెలుగు తెలియని తమిళ రిపోర్టర్లు, నార్త్-ఈస్ట్ పొలిటికల్ జర్నలిస్టులతో పాటు.. బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. వీళ్లంతా కార్తికేయ సినిమాపై తెలుగులో ట్వీట్లు వేసి, పైన చెప్పిన హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం విశేషం.
కొన్నిసార్లు సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్ కోసం ఉపయోగించే బాట్స్ వల్ల కూడా ఇలా జరగొచ్చు. కానీ అంతోఇంతో పాపులర్ అయిన కొన్ని పరభాషా ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా ఈ ట్వీట్స్ పడ్డంతో అంతా షాక్ అయ్యారు. కార్తికేయ సినిమాకే పెయిడ్ ప్రమోషన్ ఈ రేంజ్ లో ఉంటే.. రేపు అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రచారం ఇంకే రేంజ్ లో ఉంటుందోనంటూ కామెంట్స్ పడుతున్నాయి.