అమెజాన్ అదిరిపోయే ఆఫర్
లాక్ డౌన్/కరోనా తర్వాత సినిమాల బిజినెస్ లో పెను మార్పులొస్తాయని, భారీ డీల్స్ సెట్ అవ్వకపోవచ్చనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ చిన్న సైజు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు మేకర్స్ చెబుతున్న రేట్లు, వస్తున్న ఆఫర్లు రెండూ కళ్లుచెదిరేలా ఉన్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ కు అమెజాన్ ఓ బంపరాఫర్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ పోస్ట్-రిలీజ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ అక్షరాలా 140 కోట్ల రూపాయలు ఆఫర్ […]
లాక్ డౌన్/కరోనా తర్వాత సినిమాల బిజినెస్ లో పెను మార్పులొస్తాయని, భారీ డీల్స్ సెట్ అవ్వకపోవచ్చనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ చిన్న సైజు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు మేకర్స్ చెబుతున్న రేట్లు, వస్తున్న ఆఫర్లు రెండూ కళ్లుచెదిరేలా ఉన్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ కు అమెజాన్ ఓ బంపరాఫర్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ పోస్ట్-రిలీజ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ అక్షరాలా 140 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. అన్ని భాషల డిజిటల్ రైట్స్ కలుపుకొని ఈ మొత్తాన్ని ఆఫర్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్. అయితే డీల్ మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు.
ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ను 250 కోట్ల రూపాయలకు అమ్మాలని ప్రయత్నిస్తున్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. అయితే ఆ రేంజ్ లో ఇప్పటివరకు ఎవ్వరూ కోట్ చేయలేదు. కొంతమంది థర్డ్ పార్టీ వ్యక్తులు మాత్రం 200 కోట్ల రూపాయల వరకు వచ్చి ఆగారు. మరో నెల రోజుల్లో ఆర్ఆర్ఆర్ నాన్-థియేట్రికల్ రైట్స్ ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.