లీకేజీలపై సీబీఐ ఎంక్వయిరీ కోరిన నిమ్మగడ్డ..
ఏపీలో ప్రతిరోజూ వార్తల్లో వ్యక్తిగా నిమ్మగడ్డ సంచలనం సృష్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ఒప్పించిన ఆయన, ఇటీల ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో మరోసారి టాక్ ఆఫ్ ఏపీగా మారారు. ఆ కమిటీ ఇచ్చిన నోటీసుకి నిమ్మగడ్డ ఇచ్చిన సమాధానం కూడా సంచలనంగా మారింది. ప్రివిలేజ్ కమిటీ విచారణ పరిధిలోకి ఎన్నికల కమిషనర్ ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈ దశలో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో మరో సంచలనం సృష్టించారు నిమ్మగడ్డ. […]
ఏపీలో ప్రతిరోజూ వార్తల్లో వ్యక్తిగా నిమ్మగడ్డ సంచలనం సృష్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ఒప్పించిన ఆయన, ఇటీల ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో మరోసారి టాక్ ఆఫ్ ఏపీగా మారారు. ఆ కమిటీ ఇచ్చిన నోటీసుకి నిమ్మగడ్డ ఇచ్చిన సమాధానం కూడా సంచలనంగా మారింది. ప్రివిలేజ్ కమిటీ విచారణ పరిధిలోకి ఎన్నికల కమిషనర్ ఎలా వస్తారంటూ ప్రశ్నించారు.
ఈ దశలో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో మరో సంచలనం సృష్టించారు నిమ్మగడ్డ. గవర్నరుకు, తనకు మధ్య జరిగిన లేఖల వివరాలు లీకవడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ చీఫ్ సెక్రటరీ, గవర్నర్ చీఫ్ సెక్రటరీ, సీబీఐ డైరెక్టర్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స లను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
ఇటీవల ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నుంచి తనకు వచ్చిన లేఖ విషయం కూడా ఇందులో ప్రస్తావించారు. ఆ లేఖలో.. తనకు గవర్నర్ కు మధ్య జరిగిన సమాచారం ఉందని, ఆ సమాచారం అసెంబ్లీ కార్యదర్శికి ఎక్కడినుంచి వచ్చిందో కనుక్కోవాలన్నారు. పరిషత్ ఎన్నికల ఏకగ్రీవాలపై రామిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో గవర్నర్ కు తాను రాసిన లేఖను పొందుపరిచారని, సామాన్య వ్యక్తికి ఆ లేఖ ఎలా అందిందని, ఎవరో దాన్ని లీక్ చేశారని అన్నారు.
ఏపీ పోలీసులు వద్దు.. సీబీఐకే అప్పగించాలి..
ఈ లీకేజీపై విచారణ జరపాలని గవర్నరు ముఖ్య కార్యదర్శిని తాను ఇదివరకే కోరానని, అయితే ఆయన సరైన సమాధానం చెప్పలేదని ఆరోపించారు నిమ్మగడ్డ. ఎన్నికల ఉద్యోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని సీజ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో పోలీసుల పాత్రపైనా పలు ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఏపీ పోలీసుల దర్యాప్తుకి అప్పగిస్తే ఫలితం ఉండదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. 72 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించాలని, లేకపోతే తనకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారాయన.
ప్రభుత్వంపై నిందలు..
స్వతంత్రంగా విధులు నిర్వర్తించే తన వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా లేదని. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా మాట్లాడారని, దూషించారని, కుల ప్రస్తావన తెచ్చారని, వీటికి మీడియాలో వచ్చిన వచ్చిన కథనాలే సాక్ష్యాలని పిటిషన్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ.
నిమ్మగడ్డ పిటిషన్ జస్టిస్ రఘునందనరావు బెంచి ముందుకు రాగా, తనకు పిటిషనర్ నిమ్మగడ్డ తెలిసిన వ్యక్తి కావడంతో.. సదరు పిటిషన్ ని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు చెప్పారాయన.