Telugu Global
Health & Life Style

మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు.. 3 రోజుల్లో భారత్ లో లక్ష కేసులు..

కరోనా సెకండ్ వేవ్.. తొలి దశను గుర్తుచేస్తోంది. కరోనా మొదలైన తర్వాత ఎప్పుడూ లేనంతగా మహారాష్ట్రలో విజృంభణ సాగుతోంది. 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 27,126 కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలయ్యాక మహారాష్ట్రలో ఒకరోజు అత్యథిక కేసులు ఇవే. అంటే తొలి దశకంటే మలి దశ మరింత ఉధృతంగా ఉందనే విషయం ఈ పాటికే రూఢీ అయింది. కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో అధికంగానే ఉంది. ఒక్క రోజులోనే 92మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి […]

మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు.. 3 రోజుల్లో భారత్ లో లక్ష కేసులు..
X

కరోనా సెకండ్ వేవ్.. తొలి దశను గుర్తుచేస్తోంది. కరోనా మొదలైన తర్వాత ఎప్పుడూ లేనంతగా మహారాష్ట్రలో విజృంభణ సాగుతోంది. 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 27,126 కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలయ్యాక మహారాష్ట్రలో ఒకరోజు అత్యథిక కేసులు ఇవే. అంటే తొలి దశకంటే మలి దశ మరింత ఉధృతంగా ఉందనే విషయం ఈ పాటికే రూఢీ అయింది. కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో అధికంగానే ఉంది. ఒక్క రోజులోనే 92మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో కోవిడ్ మరణాలు 53,300కు చేరుకున్నాయి. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 24,49,147 కి చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డారు. పుణె, నాగ్‌ పూర్‌, ముంబై, థాణె, నాసిక్‌ జిల్లాల్లో కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది.

దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు మునుపటి తీవ్రతను చాటుతున్నాయి. శనివారం ఒక్కరోజే 40,953 కొత్త కేసులు నమోదు కాగా.. 188 మంది చనిపోయారు. 2020నవంబరు 29 తర్వాత ఒక రోజులో ఇన్ని కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు రోజుల్లో నమోదైన లక్ష కేసులతో కలుపుకొంటే దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది. ఇంతవరకు 1,59,558 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394 (2.50%)కి పెరగడం ఆందోళన కలిగించే విషయం.

కేసులు పెరగడంతో మహారాష్ట్ర సర్కారు పూర్తిగా ఇరుకున పడిపోయింది. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మహారాష్ట్రలో మందకొడిగా సాగుతోంది. కేసులు పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. మరికొన్ని చోట్ల ఆంక్షలు పెంచారు. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకేరకమైన నిబంధనలు లేకపోవడంతో.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులపాటు కేసుల ఉధృతి గమనించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని, రాష్ట్ర సరిహద్దుల్ని కూడా మూసి వేస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో కోవిడ్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశమున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

First Published:  20 March 2021 11:02 PM GMT
Next Story