Telugu Global
Cinema & Entertainment

కథ మొత్తం చెప్పేసిన నితిన్

సినిమా విడుదలకు ముందు స్టోరీలైన్ చెప్పేయడం కొత్తేంకాదు. రాజమౌళి ఈగ, మర్యాదరామన్న సినిమాల నుంచి ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. దీన్ని ఇప్పుడు మరో కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు హీరో నితిన్. తన కొత్త సినిమా రంగ్ దే స్టోరీ మొత్తాన్ని చెప్పేశాడు. నిన్న ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈ 2 నిమిషాల ట్రయిలర్ లో రంగ్ దే కథ ఏంటి, దాని ముగింపు ఎలా ఉండబోతోందనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పేశాడు దర్శకుడ వెంకీ అట్లూరి. […]

Rang De
X

సినిమా విడుదలకు ముందు స్టోరీలైన్ చెప్పేయడం కొత్తేంకాదు. రాజమౌళి ఈగ, మర్యాదరామన్న సినిమాల నుంచి ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. దీన్ని ఇప్పుడు మరో కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు హీరో నితిన్. తన కొత్త సినిమా రంగ్ దే స్టోరీ మొత్తాన్ని చెప్పేశాడు.

నిన్న ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈ 2 నిమిషాల ట్రయిలర్ లో రంగ్ దే కథ ఏంటి, దాని ముగింపు ఎలా ఉండబోతోందనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పేశాడు దర్శకుడ వెంకీ అట్లూరి. తన సినిమాలో కథ కంటే, మనుషుల మధ్య ఫీలింగ్స్, ఫన్ చాలా బాగుంటుందని, అందుకే కథ చెప్పేశానని అంటున్నాడు.

అర్జున్ చిన్నప్పుడే ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలని దేవుడ్ని కోరుకుంటాడు. కోరుకున్నట్టుగానే దేవుడు అతడికి గర్ల్ ఫ్రెండ్ అనును ప్రసాదిస్తాడు. అయితే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నది కాస్తా గయ్యాళి ఫ్రెండ్ అవుతుంది. అన్ని విషయాల్లో అర్జున్ ను డామినేట్ చేస్తుంది. చివరికి పెళ్లి కూడా. అర్జున్ కు ఇష్టం లేకపోయినా తాళి కట్టించుకుంటుంది. ఇలా గిల్లికజ్జాలతో మొదలైన వీళ్ల కాపురం ఎలా సుఖాంతమైందో రంగ్ దేలో చూపించారు.

అనుపై అర్జున్ కు ఏ క్షణంలో ప్రేమ పుట్టిందనే కీలకమైన విషయాన్ని కూడా చెప్పేయడం రంగ్ దే ట్రయిలర్ లో కొసమెరుపు. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను 26న రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  20 March 2021 10:42 AM IST
Next Story