చావు కబురు చల్లగా మొదటి రోజు వసూళ్లు
కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చావు కబురు చల్లగా సినిమాను 13 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 14 కోట్ల రూపాయలు రావాలి. కానీ మొదటి రోజు వసూళ్లు చూస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసంభవంలా కనిపిస్తోంది. చావుకబురు చల్లగా సినిమాకు మొదటి రోజు కేవలం కోటి 58 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ రెండు రోజుల్లో మరో 3 కోట్ల రూపాయల వరకు షేర్ […]
కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చావు కబురు చల్లగా సినిమాను 13 కోట్ల రూపాయలకు
అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 14 కోట్ల రూపాయలు రావాలి. కానీ మొదటి రోజు వసూళ్లు
చూస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసంభవంలా కనిపిస్తోంది.
చావుకబురు చల్లగా సినిమాకు మొదటి రోజు కేవలం కోటి 58 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
ఈ రెండు రోజుల్లో మరో 3 కోట్ల రూపాయల వరకు షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సినిమాకు నెగెటివ్
టాక్ రావడంతో మూవీ భారీ నష్టాలు చవిచూసేలా కనిపిస్తోంది.
నిజానికి మార్కెట్లో మరో సినిమా లేదు. జాతిరత్నాలు కూడా కాస్త డల్ అయింది. చావు కబురు సినిమాతో
పాటు వచ్చిన మిగతా 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో ఏమాత్రం పాజిటివ్ టాక్
తెచ్చుకున్నా సినిమా సేఫ్ అయ్యేది. కానీ కార్తికేయ సినిమా ఆమాత్రం టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 61 లక్షలు
సీడెడ్ – 28 లక్షలు
ఉత్తరాంధ్ర – 20 లక్షలు
ఈస్ట్ – 12 లక్షలు
వెస్ట్ – 7 లక్షలు
గుంటూరు – 11 లక్షలు
కృష్ణా – 12 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు