Telugu Global
NEWS

తిరుపతి ఉప ఎన్నిక: మెజార్టీపై టెన్షన్​..!

త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుపతి పార్లమెంట్​ పరిధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో వైసీసీ బంపర్​ మెజార్టీతో గెలుపొందింది. దీంతో తిరుపతిలో పార్లమెంట్ స్థానంలోనూ గెలుపు పక్కా అని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే మెజార్టీ ఎంత వస్తుంది? అన్న విషయంపైనే వాళ్లకు టెన్షన్​ నెలకొందట. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక […]

తిరుపతి ఉప ఎన్నిక: మెజార్టీపై టెన్షన్​..!
X

త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుపతి పార్లమెంట్​ పరిధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో వైసీసీ బంపర్​ మెజార్టీతో గెలుపొందింది. దీంతో తిరుపతిలో పార్లమెంట్ స్థానంలోనూ గెలుపు పక్కా అని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే మెజార్టీ ఎంత వస్తుంది? అన్న విషయంపైనే వాళ్లకు టెన్షన్​ నెలకొందట. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మిపై 2,28,376 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అయితే బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. పంచాయతీ, మున్సిపల్​ ఎన్నికల్లో సాధించిన ఊపును ఇప్పుడు కొనసాగించాలంటే ఆ పార్టీ కనీసం మూడు లక్షల పై చిలుకు మెజార్టీతో గెలవాలి దీంతో లోకల్​ వైసీసీ లీడర్లలో టెన్షన్​ పట్టుకుందట. బల్లి దుర్గా ప్రసాద్​ మృతితో ఆయన కుటుంబసభ్యులకే టికెట్​ ఇస్తారని అంతా భావించారు. ఓ దశలో ఆయన కుమారుడు కల్యాణ్​కు టికెట్​ కన్​ఫార్మ్​ అయిందని భావించారంతా.. కానీ కల్యాణ్​కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. తిరుపతి టికెట్​ను ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్​ గురుమూర్తికి కేటాయించారు. దీంతో అతడు రాజకీయాలకు కొత్త కాబట్టి.. ప్రజల్లో ఆ భావన ఏమన్నా ఉంటుందేమోనని వైసీసీ శ్రేణులు టెన్షన్​ పడుతున్నాయట.

మరోవైపు టీడీపీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. అందరికంటే ముందే పనబాక లక్ష్మిని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. కానీ ఆమె మాత్రం పోటీకి పెద్దగా సుముఖంగా లేదట. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ఆర్థికంగా ఎంతో నష్టపోయానని ఆమె అంటున్నారట. దీంతో ఖర్చు మొత్తం టీడీపీ అధిష్ఠానమే చూసుకుంటామని భరోసా ఇచ్చింది. అయినప్పటికీ ఆమె ప్రచారంలో పెద్దగా దూకుడుగా వెళ్లడం లేదు.

మరోవైపు ఇక్కడ జనసేన కాకుండా బీజేపీ పోటీచేస్తుండటం వైసీసీకి కలిసి వస్తుంది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్​ కొంత మేర ఉంది. ఒకవేళ జనసేన అభ్యర్థి పోటీచేస్తే వారంతా గుంపుగుత్తగా ఆ పార్టీకి అండగా నిలబడవచ్చు. కానీ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి.. జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్​ఫర్​ అవుతాయని చెప్పలేం. వైసీపీకి ఇది కూడా కలిసి వస్తుంది.

First Published:  19 March 2021 1:31 PM IST
Next Story