Telugu Global
NEWS

చంద్రబాబుకు బిగ్​ రిలీఫ్​.. అసైన్డ్​ భూముల కేసుపై కోర్టు స్టే..!

రాజధాని అసైన్డ్​ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. అసైన్డ్​ భూముల వ్యవహారంలో ఇటీవల సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం చంద్రబాబు తరఫున సీనియర్​ లాయర్లు సిద్ధార్థ లూథ్రా, నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్​ వాదనలు వినిపించారు. మరోవైపు […]

చంద్రబాబుకు బిగ్​ రిలీఫ్​.. అసైన్డ్​ భూముల కేసుపై కోర్టు స్టే..!
X

రాజధాని అసైన్డ్​ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. అసైన్డ్​ భూముల వ్యవహారంలో ఇటీవల సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం చంద్రబాబు తరఫున సీనియర్​ లాయర్లు సిద్ధార్థ లూథ్రా, నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్​ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ జనరల్​ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీఐడీ చేపట్టిన విచారణపై స్టే విధించింది.

గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి భూములకు సంబంధించి ల్యాండ్​ పూలింగ్​ చేసేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసులు పెట్టింది. అసైన్డ్​ భూములను ముందుగానే కొందరు తక్కువ ధరలకు కొనుగోలుచేసి.. ఆ తర్వాత సదరు రిజిస్ట్రేషన్​ చేసుకొన్నారని వైసీసీ ఆరోపిస్తున్నది. ఇలా రిజిస్ట్రేషన్​ చేసుకున్న భూములను ఆ తర్వాత ల్యాండ్​ పూలింగ్​ కింద ప్రభుత్వానికి అప్పగించి లబ్ధి పొందారన్నది ప్రధాన ఆరోపణ. ఎస్సీ, ఎస్టీల ఆస్తులను బలవంతంగా లాక్కోవడం కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకు వస్తుందని వైసీసీ నేతలు వాదించారు. అయితే గతంలో తీసుకొచ్చిన జీవో ప్రకారమే అసైన్డ్​ భూములను తీసుకున్నారని.. ఇది చట్టబద్దమేనని టీడీపీ వాదిస్తూ వస్తున్నది.

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడిపై సీఐడీ అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 23న విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. దీంతో సీఐడీ నమోదు చేసిన కేసులపై చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్​ లాయర్లు సిద్ధార్థ వాదనలు వినిపించారు. తన మీద పెట్టిన కేసులు కక్ష సాధింపుతో కూడినవని చంద్రబాబు నాయుడు క్వాష్​ పిటిషన్​లో పేర్కొన్నారు.

అయితే చట్టాలపై, జీవోలపై దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు లేదని.. చంద్రబాబు తరఫు లాయర్​ వాదించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలంటే ఫిర్యాదు దారుడు ఎస్సీ అయి ఉండాలే తప్ప.. ఇతరులు ఆ కేసును ఎలా పెడతారంటూ ఆయన తరఫు లాయర్​ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉంటే సమర్పించాలని కోర్టు .. సీఐడీని కోరింది. అయితే సీఐడీ మాత్రం ఆధారాలు ఇప్పుడు ఇవ్వలేమని.. విచారణకు అవకాశం ఇస్తే ఆధారాలు సేకరిస్తామని చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఐడీ విచారణపై స్టే విధించింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది.

First Published:  19 March 2021 1:23 PM IST
Next Story