Telugu Global
NEWS

తెలంగాణలో స్కూల్స్ మూసేస్తారా..?

అన్ లాక్ తర్వాత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త భయం భయంగానే స్కూళ్లను తెరిచింది తెలంగాణ సర్కారు. ఏపీలో స్కూల్స్ తెరవడం, పరీక్షలు మొదలవడం.. అన్నీ జరిగిపోయిన తర్వాత తెలంగాణలో కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24నుంచి 6, 7, 8 తరగతులకు స్కూల్స్ మొదలయ్యాయి. ఏపీలో ప్రైమరీ సెక్షన్ కూడా నడుస్తున్నా.. తెలంగాణలో ఇంకా చిన్న తరగతులు మొదలు కాలేదు. ఈ ఏడాదికింతే అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ […]

తెలంగాణలో స్కూల్స్ మూసేస్తారా..?
X

అన్ లాక్ తర్వాత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త భయం భయంగానే స్కూళ్లను తెరిచింది తెలంగాణ సర్కారు. ఏపీలో స్కూల్స్ తెరవడం, పరీక్షలు మొదలవడం.. అన్నీ జరిగిపోయిన తర్వాత తెలంగాణలో కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24నుంచి 6, 7, 8 తరగతులకు స్కూల్స్ మొదలయ్యాయి. ఏపీలో ప్రైమరీ సెక్షన్ కూడా నడుస్తున్నా.. తెలంగాణలో ఇంకా చిన్న తరగతులు మొదలు కాలేదు. ఈ ఏడాదికింతే అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ముప్పు తెలంగాణ సర్కారుని మరోసారి హడలిస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ స్కూల్స్ వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు.

గత మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యాసంస్థల విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. 6, 7, 8, 9 తరగతులకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే ప్రతిపాదనలున్నాయి. 10వ తరగతి పిల్లలను మాత్రమే స్కూల్స్ కి అనుమతించి, మిగతావారందరికీ ఆన్ లైన్ తరగతులు బోధించే దిశగా ఆలోచన చేస్తున్నారు అధికారులు. ప్రైమరీ సెక్షన్ ఎలాగూ మొదలు కాబట్టి, ఈ ఏడాదికి ఇక దాని ఊసే లేదు. అదే విధంగా.. 1 నుంచి 9 వరకు ఆల్ పాస్ ఆర్డర్ జారీ చేయబోతున్నారు. గతేడాది లాగే పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తారు. ఈసారి టెన్త్‌ పరీక్షలు మే 17 నుంచి జరపడానికి ఇది వరకే విద్యా శాఖ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో దానిపై కూడా పునరాలోచించబోతోంది ప్రభుత్వం. అప్పటి పరిస్థితినిబట్టి పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తారు.

గురుకులాలు మూత..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఎక్కువగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్, కేజీబీవీ హాస్టల్స్ ఉన్నాయి. దీంతో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉన్న గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులు రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలకు సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. కాలేజీల్లో కరోనా కేసులు పెద్దగా లేకపోవడంతో కొవిడ్‌ నిబంధనలు పకడ్బందిగా అమలు చేస్తూ తరగతులు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.

First Published:  18 March 2021 3:59 AM IST
Next Story