వకీల్ సాబ్ కు ఊపొచ్చింది
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు మగువ సాంగ్… సత్యమేవ జయతే సాంగ్స్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఈ సినిమాలో ‘కంటి […]
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు మగువ సాంగ్… సత్యమేవ జయతే సాంగ్స్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఈ సినిమాలో ‘కంటి పాప కంటిపాప..’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఇది.
ఈ సాంగ్ ఇలా రిలీజైందో లేదో అలా ఇనిస్టెంట్ గా హిట్టయింది. గంటల వ్యవథిలోనే ఈ పాటకు 20లక్షల వ్యూస్ వచ్చాయి. మరికొన్ని గంటల్సో ఈ సాంగ్ 50 లక్షల వ్యూస్ సాధించి.. తక్కువ టైమ్ లో 5 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది.