ఇంటికో విమానం.. ఎక్కడంటే..
మనదేశంలో ఇంటికో బైక్ ఉండడం కామన్. అదే కొన్ని దేశాల్లో అయితే ప్రతి ఇంటికో కారు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంటికో విమానం ఉంది. అదెక్కడంటే.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన సియెర్రా ప్రాంతంలో ఇంటికో విమానం ఉంటుంది. ప్రతి ఇంట్లో వాళ్ల వాళ్ల విమానాలు పార్క్ చేసి దర్శనమిస్తాయి. అంతేకాదు ఇక్కడుండే వాళ్లంతా పైలట్లే.. వీళ్లందరికీ సొంతంగా విమానాలు, రన్‌వేలు ఉంటాయి. ఇలాంటి ఏరియాలను ఎయిర్ పార్క్‌లంటారు. అసలు విషయం ఇదీ.. రెండో ప్రపంచయుద్ధంలో […]

మనదేశంలో ఇంటికో బైక్ ఉండడం కామన్. అదే కొన్ని దేశాల్లో అయితే ప్రతి ఇంటికో కారు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంటికో విమానం ఉంది. అదెక్కడంటే.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన సియెర్రా ప్రాంతంలో ఇంటికో విమానం ఉంటుంది. ప్రతి ఇంట్లో వాళ్ల వాళ్ల విమానాలు పార్క్ చేసి దర్శనమిస్తాయి. అంతేకాదు ఇక్కడుండే వాళ్లంతా పైలట్లే.. వీళ్లందరికీ సొంతంగా విమానాలు, రన్‌వేలు ఉంటాయి. ఇలాంటి ఏరియాలను ఎయిర్ పార్క్‌లంటారు.
అసలు విషయం ఇదీ..
రెండో ప్రపంచయుద్ధంలో విమానాల వాడకం భారీగా ఉంది. అయితే అప్పుడు వాటిని ఉంచడం కోసం ఈ ఎయిర్ పార్క్ లు, ఫ్లైయింగ్ కమ్యూనిటీలు ఏర్పాటు చేశారు. అవే ఇప్పటికీ ఇలా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇక్కడ నివసించే ప్రజలు విమానాలను సాధారణ ప్రయాణానికి ఉపయోగిస్తారు. కేవలం సియెర్రాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 630 కి పైగా రెసిడెన్షియల్ ఎయిర్‌పార్క్‌లు ఉన్నాయి. అయితే వాటిలో 610 కు పైగా పార్కులు అమెరికాలోనే ఉండడం విశేషం.