కరోనా తర్వాత బిగ్ డీల్ ఇదే
కరోనా తర్వాత థియేట్రికల్ బిజినెస్ లెక్కలన్నీ మారిపోయాయి. అతి తక్కువ రేట్లకు సినిమాలు అమ్ముడుపోయాయి. వంద శాతం ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత, ఉప్పెన-జాతిరత్నాలు లాంటి సినిమాలు వచ్చిన తర్వాత థియేట్రికల్ బిజినెస్ గాడిలో పడింది. ఇలాంటి టైమ్ లో పెద్ద డీల్ ఒకటి లాక్ అయింది. ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓవర్సీస్ డీల్ లాక్ అయింది. ఏకంగా 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఓవర్సీస్ […]

కరోనా తర్వాత థియేట్రికల్ బిజినెస్ లెక్కలన్నీ మారిపోయాయి. అతి తక్కువ రేట్లకు సినిమాలు అమ్ముడుపోయాయి. వంద శాతం ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత, ఉప్పెన-జాతిరత్నాలు లాంటి సినిమాలు వచ్చిన తర్వాత థియేట్రికల్ బిజినెస్ గాడిలో పడింది. ఇలాంటి టైమ్ లో పెద్ద డీల్ ఒకటి లాక్ అయింది. ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓవర్సీస్ డీల్ లాక్ అయింది. ఏకంగా 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయాయి. లాక్ డౌన్ తర్వాత ఓవర్సీస్ లో నమోదైన అతిపెద్ద డీల్ ఇదే. ఈ మేరకు నిర్మాతలకు 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా అందింది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అప్పటికి పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.