Telugu Global
NEWS

హైదరాబాద్‌లో భారీగా పెరుగుతున్న కేసులు..

దేశ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కరోనా సెకండ్ వేవ్ మొదలైందేమో అనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 35,871 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,364 గా ఉంది. దీంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. చాలా చోట్ల స్కూళ్లు, బస్సులు నిలిపివేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,01,769 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో రెండు లక్షల కేసులు గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, […]

హైదరాబాద్‌లో భారీగా పెరుగుతున్న కేసులు..
X

దేశ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కరోనా సెకండ్ వేవ్ మొదలైందేమో అనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 35,871 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,364 గా ఉంది. దీంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. చాలా చోట్ల స్కూళ్లు, బస్సులు నిలిపివేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,01,769 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో రెండు లక్షల కేసులు గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం సిటీలో 2,101 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీరిలో 958 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ వారంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో511 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 278, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్‌ జిల్లాలో 129 కేసులు ఉన్నాయి. కొన్ని లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ప్రతిరోజు 150కి పైనే కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం, శానిటైజేషన్‌, భౌతికదూరాన్ని పక్కన పెట్టడం.. వీటితో పాటు ప్రభుత్వం కూడా కరోనా స్క్రీనింగ్ ఆపేయడం వల్ల వైరస్ సోకిన వాళ్లు కూడా ఆ విషయం తెలియక బయట తిరిగేస్తున్నారు. దాంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. అందుకే ఇప్పటి నుంచైనా సీరియస్‌గా జాగ్రత్తలు పాటించడం మంచిది. వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.

First Published:  18 March 2021 2:44 AM GMT
Next Story