Telugu Global
Cinema & Entertainment

జాతిరత్నాలు దర్శకుడికి మరో ఆఫర్

హిట్ ఇచ్చిన దర్శకుడ్ని ఇండస్ట్రీ ఊరికే వదిలేస్తుందా? దర్శకుడు అనుదీప్ కూడా దీనికి మినహాయింపు కాదు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు.. వెంటనే మరో ఆఫర్ అందుకున్నాడు. ఈసారి తన సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు ఈ దర్శకుడు. తన మూడో సినిమాకు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను డైరక్ట్ చేయబోతున్నాడు అనుదీప్. ఈ మేరకు ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు మొదలయ్యాయి. ఆశ్చర్యంగా వైష్ణవ్ తేజ్ కు కూడా ఇది మూడో సినిమానే. ఉప్పెన […]

జాతిరత్నాలు దర్శకుడికి మరో ఆఫర్
X

హిట్ ఇచ్చిన దర్శకుడ్ని ఇండస్ట్రీ ఊరికే వదిలేస్తుందా? దర్శకుడు అనుదీప్ కూడా దీనికి మినహాయింపు కాదు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు.. వెంటనే మరో ఆఫర్ అందుకున్నాడు. ఈసారి తన సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు ఈ దర్శకుడు.

తన మూడో సినిమాకు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను డైరక్ట్ చేయబోతున్నాడు అనుదీప్. ఈ మేరకు ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు మొదలయ్యాయి. ఆశ్చర్యంగా వైష్ణవ్ తేజ్ కు కూడా ఇది మూడో
సినిమానే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్.. తన రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో నటించాడు. ఇప్పుడు మూడో సినిమాను అనుదీప్ తో చేస్తున్నాడు. అటు అనుదీప్ కూడా పిట్టగోడ, జాతిరత్నాలతో 2 సినిమాలు పూర్తిచేసుకున్నాడు.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో త్వరలోనే ఈ సినిమా పట్టాలపైకి రాబోతోంది. తన మూడో సినిమాకు కూడా అనుదీప్, కామెడీ కాన్సెప్ట్ నే సెలక్ట్ చేసుకున్నాడు. ఈసారి కామెడీతో పాటు లవ్ కూడా చూపిస్తానంటున్నాడు.

First Published:  17 March 2021 4:16 AM IST
Next Story