Telugu Global
Cinema & Entertainment

నెలాఖరు నుంచి లూసిఫర్?

లూసిఫర్ రీమేక్ కు లైన్ క్లియర్ అయింది. చిరంజీవి, మోహన్ రాజా మధ్య ఫైనల్ డిస్కషన్లు పూర్తయ్యాయి. మోహన్ రాజా చెప్పిన నెరేషన్ కు చిరంజీవి ఫిదా అయ్యారు. వెంటనే కాల్షీట్లు  కేటాయించారు. ఈ నెలాఖరు నుంచి లూసిఫర్ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఆ సినిమా షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ వెంటనే గ్యాప్ ఇవ్వకుండా లూసిఫర్ రీమేక్ లోకి షిఫ్ట్ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్ […]

నెలాఖరు నుంచి లూసిఫర్?
X

లూసిఫర్ రీమేక్ కు లైన్ క్లియర్ అయింది. చిరంజీవి, మోహన్ రాజా మధ్య ఫైనల్ డిస్కషన్లు పూర్తయ్యాయి. మోహన్ రాజా చెప్పిన నెరేషన్ కు చిరంజీవి ఫిదా అయ్యారు. వెంటనే కాల్షీట్లు కేటాయించారు. ఈ నెలాఖరు నుంచి లూసిఫర్ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

ప్రస్తుతం ఆచార్య సినిమా పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఆ సినిమా షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ వెంటనే గ్యాప్ ఇవ్వకుండా లూసిఫర్ రీమేక్ లోకి షిఫ్ట్ అవుతారు. ఈ సినిమాలో
హీరోయిన్ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. మరోసారి నయనతార కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మరో కీలక పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నారు.

ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో రాబోతోంది లూసిఫర్ రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. తెలుగులో కూడా దాదాపు ఇదే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు.
ఎందుకంటే, ఈ పేరు టాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయిపోయింది.

First Published:  17 March 2021 4:07 AM IST
Next Story