Telugu Global
Health & Life Style

మూడ్ ఆఫ్ అయిందా.. ఇలా చేయండి

ఒక్కోసారి రోజంతా హ్యాపీగా తెలియకుండా గడిచిపోతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం రోజంతా ఏదో నిరాశ. ఏ పని చేద్దామన్నా తెలియని నిస్సత్తువ. మనసంతా ఏదోలా ఉంటుంది. దాని వల్ల చేసే పనిలో ఉత్సాహం తగ్గుతుంది. మరి అలా మూడ్ ఆఫ్ అయినప్పుడు ఏం చేయాలి? తిరిగి మంచి మ్యూడ్ లోకి ఎలా రావాలి? మానవ శరీరంలో హ్యాపీ హార్మోన్లు కొద్ది నిమిషాలే ఉంటాయి. కానీ, విషాద హార్మోన్లు కొన్ని గంటల పాటు అంటిపెట్టుకొనే ఉంటాయి. అందకే […]

మూడ్ ఆఫ్ అయిందా.. ఇలా చేయండి
X

ఒక్కోసారి రోజంతా హ్యాపీగా తెలియకుండా గడిచిపోతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం రోజంతా ఏదో నిరాశ. ఏ పని చేద్దామన్నా తెలియని నిస్సత్తువ. మనసంతా ఏదోలా ఉంటుంది. దాని వల్ల చేసే పనిలో ఉత్సాహం తగ్గుతుంది. మరి అలా మూడ్ ఆఫ్ అయినప్పుడు ఏం చేయాలి? తిరిగి మంచి మ్యూడ్ లోకి ఎలా రావాలి?
మానవ శరీరంలో హ్యాపీ హార్మోన్లు కొద్ది నిమిషాలే ఉంటాయి. కానీ, విషాద హార్మోన్లు కొన్ని గంటల పాటు అంటిపెట్టుకొనే ఉంటాయి. అందకే అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అయ్యి, మనసు నిరుత్సాహంగా అనిపిస్తుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే శరీరంలో పాజిటివ్‌ రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేయొచ్చు. అవేంటంటే..

డ్రాయింగ్ తో..
ఆఫీస్ లో ఒక పది నిముషాలు బ్రేక్ తీసుకుని పేపర్, పెన్ పట్టుకుని ఏదైనా బొమ్మ గీయడం మొదలుపెట్టండి. మనసుకు ఏది తోస్తే అది గీసేయాలి. పూర్తైన తర్వా దాని వైపు చూస్తే.. ఆశ్చర్యం అయినా కలుగుతుంది లేదా నవ్వొస్తుంది. రెండూ మీ మూడ్ ని మార్చేసేవే. ఈ టెక్నిక్ చాలా బాగా పని చేస్తుంది ఒక సారి ట్రై చేసి చూడండి.

పాజిటివ్ మ్యూజిక్
మ్యూజిక్ అన్ని రకాల భావాలను కదిలించగలదు. అది మనసుని ఉల్లాసంగా ఉంచగలదు, బాధ కూడా పెట్టలదు. సంగీతానికి అంతటి శక్తి ఉంది. అందుకే మనసు బాగాలేనప్పుడు పాజిటివ్ సంగీతం వింటే చిటికెలో మూడ్ మారిపోతుందంటున్నారు నిపుణులు. అందుకే మూడ్ ఆఫ్ అయినప్పుడు మంచి మ్యూజిక్ వినాలి.

నడిస్తే చాలు
నడక ఆరోగ్యానికే కాదు, మనసుకి కూడా మంచిదే. నడుస్తూ మీకు నచ్చిన మ్యూజిక్ వింటే ఇంకా మంచిది. నడిచే సమయంలో పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయని మానసిక శాస్త్రవేత్తలు తరచూ చెప్పే మాట.

ఫుడ్ తో కూడా..
శరీరానికి సరిపడా ఎనర్జీ లేనప్పుడు కూడా మూడ్ ఆఫ్ అవుతుంది. అందుకే తక్షణ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏదో ఒకటి తినాలి. వాటిలో అరటిపండు బెటర్. ఎందుకంటే, అరటిపళ్ళల్లో ఉండే గుణాలు తక్షణ శక్తినిస్తాయి. దీని వల్ల కూడా మన మూడ్ లో మార్పులొచ్చే అవకాశం ఉంది.

నీట్ గా ఉంటే..
మీరు ఉండే ప్రదేశం శుభ్రంగా లేకపోతే చికాకుగా అనిపిస్తుంది. అందుకే పని చేసే చోట అంతా క్లీన్ గా ఉండాలి. అవసరమైనవి తప్ప మిగతావేవీ డెస్క్ పై లేకుండా చూసుకుంటే మంచిది. దాంతో పాటు మీకు ఉత్సాహాన్ని ఇచ్చే వస్తువులు, బొమ్మలు లాంటివి డెస్క్ పై పెట్టుకోండి. వాటిని రోజు చూడడం ద్వారా మూడ్ చేంజ్ అవుతుంది.

First Published:  16 March 2021 2:20 AM GMT
Next Story