ఉప్పెనంత వాటా అందుకున్న సుకుమార్
ఉప్పెన సినిమా రెవెన్యూ పరంగా బుచ్చిబాబుకు, వైష్ణవ్ తేజ్ కు ఏ రేంజ్ లో కలిసొచ్చిందో తెలీదు కానీ, దర్శకుడు సుకుమార్ కు మాత్రం బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఈ సినిమాను తెరవెనక నుంచి నడిపించినందుకు గాను 17 నుంచి 18 కోట్ల రూపాయలు అందుకున్నాడు సుక్కూ. ఉప్పెన సినిమాతో తన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేశాడు సుకుమార్. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం అన్నీ బుచ్చిబాబే. సుకుమార్ మాత్రం అతడికి ఓ వేదిక సమకూర్చి పెట్టాడు. […]
ఉప్పెన సినిమా రెవెన్యూ పరంగా బుచ్చిబాబుకు, వైష్ణవ్ తేజ్ కు ఏ రేంజ్ లో కలిసొచ్చిందో తెలీదు కానీ,
దర్శకుడు సుకుమార్ కు మాత్రం బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఈ సినిమాను తెరవెనక నుంచి
నడిపించినందుకు గాను 17 నుంచి 18 కోట్ల రూపాయలు అందుకున్నాడు సుక్కూ.
ఉప్పెన సినిమాతో తన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేశాడు సుకుమార్. ఈ సినిమాకు
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం అన్నీ బుచ్చిబాబే. సుకుమార్ మాత్రం అతడికి ఓ వేదిక సమకూర్చి
పెట్టాడు. వైష్ణవ్ తేజ్ ను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. రంగస్థలం సినిమా సెట్స్ పై
ఉంటుండగానే ఉప్పెన కథను ఓకే చేయించాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నాడు. ప్రచారంలో కూడా
కీలకంగా వ్యవహరించాడు.
అలా ఉప్పెన సినిమా సూపర్ హిట్టయింది. 40 కోట్ల రూపాయల షేర్ సాధించింది. శాటిలైట్, డిజిటల్
లాంటి నాన్-థియేట్రికల్ రైట్స్ దీనికి అదనం. 18 కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకు
సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు, సుకుమార్ కు మధ్య ఫిఫ్టీ-ఫిఫ్టీ డీల్ ఉంది.
ఇందులో భాగంగా ఉప్పెన సినిమాకు సంబంధించి 17 నుంచి 18 కోట్ల రూపాయల్ని తన వాటాగా
అందుకున్నాడు ఈ దర్శకుడు.